Pashvik Yog: చంద్రుడి రాశిలో ప్రమాదకరమైన యోగం.. ఈ 3 రాశుల జీవితం నాశనం..
Surya Gochar 2023: ఇటీవల సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అశుభకరమైన యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Pashvik Yog In Karka Rashi 2023: సాధారణంగా గ్రహాల సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొన్ని రాశులకు అశుభకరంగానూ ఉంటుంది. గ్రహాల రాజు సూర్యుడు సంవత్సరం మెుత్తం మీద నెలకొకసారి ఒక్కో రాశిలో సంచరిస్తారు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల పష్విక యోగం ఏర్పడుతోంది. మీ జాతకంలో గ్రహం మరియు త్రిభుజం లేనప్పుడు పస్విక్ యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. కుండలిలో ఈ యోగం ఉన్నవారు ధన నష్టంతోపాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి
సూర్యుడు చేస్తున్న పస్విక్ యోగం మిథున రాశి వారికి చాలా హానికరం. ఈ సమయంలో మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రాపర్టీ మొదలైనవి కొనడం మానుకోండి. మీ దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. చర్చలకు దూరంగా ఉండండి. పనిలో అలసత్వం ప్రదర్శించవద్దు.
కన్య రాశి
పష్విక యోగం ఈ రాశి వారిని చాలా బాధపెడుతుంది. ఈ సమయంలో కొత్త పని లేదా శుభకార్యం వంటివి మెదలు పెట్టొద్దు. మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. భాగస్వామ్యంతో చేసే పనుల్లో నష్టాల రావచ్చు. మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
సూర్యుడి చేస్తున్న ఈ అశుభకరమైన యోగం ధనస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. పిల్లలు పుట్టకపోవడం వల్ల భార్యభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
Also Read: Surya Nakshatra Gochar 2023: మరో 48 గంటల్లో ఈ రాశులవారు కోటీశ్వరులు కానున్నారు.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook