Sun transit 2023: రేపు సూర్యుడి గమనంలో కీలక మార్పు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..
Surya Gochar 2023: రేపు సూర్యభగవానుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అని పిలుస్తారు. కర్కాటక రాశిలో సూర్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు.
Sun Transit in Cancer 2023: గ్రహాల రాజు సూర్యుడు జులై 16, ఉదయం 04:59 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో ఆగస్టు 17, 2023 మధ్యాహ్నం 01:27 వరకు ఉండనున్నాడు. నెలకొకసారి సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఈసారి కర్కాటక రాశిలోకి వెళ్లనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అని పిలుస్తారు. పైగా కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సూర్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం: ఇదే రాశిలో సూర్యుని సంచారం జరగబోతోంది. సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించిన వెంటనే మీరు శుభ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తుల: సూర్యుడు మీ రాశి యెుక్క పదకొండవ ఇంటికి అధిపతి. సూర్యుని సంచారం మీ కెరీర్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ వివాదాలన్నీ పరిష్కరించబడతాయి.
మేషం: మేష రాశి వారికి సూర్యుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిని ఐదవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు పరిపాలిస్తాడు. దీంతో మీరు శుభఫలితాలు పొందుతారు. బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. విద్యారంగానికి సంబంధించిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథునం: సూర్యుని సంచారం మిథున రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లబిస్తుంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెంట ఉంటుంది. ఈ సమయంలో మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
Also Read: Budh Surya Yuti 2023: మరో రెండు రోజుల్లో అరుదైన కలయిక.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు..డబ్బే డబ్బు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook