Surya Rashi Parivartan 2023 in Mithun: నెలకొకసారి రాశిని మారుస్తాడు సూర్యభగవానుడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 15న సూర్యుడు బుధుడి రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మిథున సంక్రాంతి అని పిలుస్తారు. మిథునరాశిలో సూర్యుని సంచారం నాలుగు రాశులవారికి అదృష్టాన్ని ఇవ్వనుంది. సూర్యుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి - సూర్యుని సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతిని ఇస్తుంది. మీ ధనం రెట్టింపు అవుతుంది. మీలో ధైర్యం  పెరుగుతుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం  పెరుగుతుంది. మీ లీడర్ షిప్ క్వాలిటీస్ మెరుగుపడతాయి. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. 
సింహ రాశి - ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు. దీని కారణంగా సూర్యుడి సంచారం సింహరాశివారికి ఎల్లప్పుడూ శుభప్రదంగానే ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి మీ వశమవుతుంది. 


Also Read: Shukra Gochar 2023: జూలై 07న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..


కన్యారాశి - సూర్యుని రాశి మార్పు కన్యారాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఎలాంటి కార్యన్నైనా సులభంగా సాధిస్తారు. విదేశాల్లో స్థిరపడాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీరు కెరీర్ లో ముందుకు సాగే అవకాశం ఉంది. 
కుంభ రాశి - ఆదిత్యుడి సంచారం వల్ల కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది. మీ జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారులు లాభపడతారు. 


Also Read: Mangal Gochar 2023: త్వరలో సింహరాశి ప్రవేశం చేయనున్న కుజుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook