Surya Grahan 2022: ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహణం ఒక అశుభకరమైన సంఘటనగా జోతిష్య శాస్త్రం పరిగణించింది. ఈ రోజు(మంగళవారం) పూజలు, శుభకార్యాలు చేయడం నిషేధించారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యభగవానుడితో పాటు ఇతర దేవుళ్లను స్మరించుకోవాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2022 సంవత్సరంలో ఏర్పడిన సూర్య గ్రహాణాలకంటే ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం చాలా శక్తి వంతమైనది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో చివరి గ్రహం కాబట్టి ఈ గ్రహాణానికి చాలా ప్రత్యేక ఉంది. ఈ గ్రహణం అన్ని దేశాల్లా కాకుండా భారత్‌లో అక్టోబర్ 25 సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభం కాబోతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం శాస్త్రం నిషేధించింది. గ్రహణం తర్వాత వెంటనే కొన్ని పనులు చేయడం చాలా ముఖ్యమని శాస్త్రం సూచిస్తోంది.  సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి వస్తుందని ఈ శక్తి నుంచి విముక్తి  పొందడానికి పలు రకాల పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఎలాంటి పనులు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..  


గ్రహణం ముగిసిన తర్వాత అందరూ ఈ మంత్రాలను పాటించాల్సి ఉంటుంది:



సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేయాలి ఎందుకో తెలుసా..?:
>>సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తులసి మొక్కపై గంగాజలం చల్లి శుద్ధి చేయాలి.
>> ఇంట్లో మీరు పూజించే విగ్రహాలపై కూడా గంగాజలం చల్లి శుభ్రం చేయాల్సి ఉంటుంది.
>>అంతేకాకుండా ఇంట్లోని పూజా స్థలంలో లేదా పూజించే స్థలంలో గంగాజలాన్ని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది.
>>ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహణం కారణంగా వచ్చే ప్రతికూల శక్తి గర్భిణీలకు పుట్టబోయే బిడ్డపై పడుతుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీరు గ్రహణం తర్వాత తప్పకుండా తల స్నానం చేయాల్సి ఉంటుంది.
>>జ్యోతిష్యం ప్రకారం గ్రహణం తర్వాత నువ్వులు, శనగ పప్పులను పేదవారికి దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
>>గ్రహణం తర్వాత స్నానంతో పాటు దానధర్మాలకు కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చింది జోతిష్య శాస్త్రం. కాబట్టి మీకు చేతనైనంత దానం చేయడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
>>స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం కలపుకుని తల స్నానం చేస్తే ప్రతికూల ప్రభావాలు తొగిపోతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
>>ఇలా గ్రహణం ముగిసిన తర్వాత తల స్నానాలు చేసి దేవతలను దర్శించుకోవాల్సి ఉంటుంది.


 


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి