Surya Grahan 2023: ఏప్రిల్ 20 నుంచి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే?
Solar Eclipse 2023: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Surya Grahan 2023 effect Pregnant women: మరో వారం రోజుల్లో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అదే రోజు వైశాఖ మాసం అమావాస్య కూడా. ఈ ఖగోళ సంఘటనను ఆస్ట్రాలజీలో అశుభకరమైనదిగా భావిస్తారు. అందుకే గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేదించడమైంది. దీంతోపాటు గ్రహణ కాలానికి సంబంధించి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి.
గ్రహణం సమయంలో సూర్యుని నుండి ప్రమాదకరమైన UV కిరణాలు వెలువడుతాయి. ఈ గ్రహణ టైంలో గర్భిణీ స్త్రీలు బయటకు వస్తే ఆ అతినీలలోహిత కిరణాలు ఆమెకు, పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్య భగవానుడిని రాహు-కేతులు మింగడం వల్ల సూర్యగ్రహణం సంభవిస్తుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏయే విషయాలను గుర్తించుకోవాలో తెలుసుకుందాం.
Also read: Chaturgrahi Yogam: ఏప్రిల్ 22న చతుర్గ్రహీ యోగం.. ఈ 5 రాశులపై కనక వర్షం...
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
** సూర్యగ్రహణం విడిచేవరకు గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. తద్వారా అతినీలలోహిత కిరణాల నుండి కడుపులో ఉన్న బిడ్డను రక్షించవచ్చు.
** గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణాన్ని చూడకూడదు. ఇది వారిపై చెడు ప్రభావం చూపుతుంది.
** గ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది, కాబట్టి గ్రహణం మరియు సూతకాల సమయంలో ఏదైనా తినడం నిషేధించబడింది. కానీ గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు పండ్లను సరిగ్గా శుభ్రం చేసిన తర్వాత తీసుకోవచ్చు.
** గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో సూది, కత్తెర, కత్తి మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డపై నెగిటివ్ ఎనర్జీ పడే అవకాశం ఉంది.
Also Read: Rajyog 2023: మూడు శతాబ్ధాల తర్వాత ఏర్పడిన నవపంచం రాజయోగం.. ఈ 4 రాశులవారికి లక్, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook