Surya-Chandra Grahan 2023: సాధారణంగా ఒక గ్రహం యెుక్క నీడ మరొక  గ్రహం మీద పడటాన్నే గ్రహణం అంటారు. ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. వీటి ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. అయితే గ్రహణ కాలంలో మీరు చేసే కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా.. మీకు అశుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు కూడా శుభఫలితాలను ఇవ్వటం ప్రారంభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20, గురువారం ఏర్పడుతుంది. సరిగ్గా 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణం సమయంలో మీరు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ చర్యలేంటో తెలుసుకుందాం. 


ఈ చర్యలు చేయండి


  1. మీరు డబ్బు అప్పుగా తీసుకుని చెల్లించలేకపోతున్నట్లయితే గ్రహణం రోజున తాళం కొని.. చంద్రుని కాంతి ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో రాత్రంతా ఉంచండి. అనంతరం తర్వాత రోజు ఉదయం దానిని ఆలయంలో ఉంచడం ద్వారా మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. దీంతోపాటు మీ ఇంట్లోకి డబ్బు రాక పెరుగుతుంది.

  2. మీరు కెరీర్ లో అడ్డంకులు లేదా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే .. అలాంటి వారు గ్రహణం రోజు కాకులకు తీపి అన్నం తినిపించండి. ఈ పరిహారం చేయడం వల్ల శని, రాహు, కేతువుల దుష్పరిణామాలు తగ్గి మీ పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. 

  3. మీ జాతకంలో గ్రహణ దోషం ఉంటే.. అలాంటి వారు చంద్రగ్రహణం టైంలో అవసరమైన వారికి పాలు, అన్నం, మిఠాయిలు మొదలైన వాటిని దానం చేయండి. ఇది చంద్రుని యొక్క శుభ ప్రభావాలను పెంచుతుంది. అంతేకాకుండా మీ దోషాన్ని తొలగిస్తుంది.  

  4. గ్రహణం రోజు వెండి ముక్క, పాలు మరియు గంగాజలం తీసుకొని చంద్రగ్రహణం యొక్క నీడ పడే ప్రదేశంలో ఉంచండి. వీటిని మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో ఎరుపు రంగు గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మనిషికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి.


Also Read: Shani Dev: వచ్చే నెలలో వీరి జీవితాన్ని నాశనం చేయబోతున్న శని.. ఇందులో మీ రాశి ఉందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook