Solar Eclipse 2024 date and time: సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. వచ్చే ఏడాది రెండు సూర్య, రెండు చందగ్రహణాలు ఏర్పడనున్నాయి. 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఈసారి ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది మీన మరియు రేవతి నక్షత్రాల్లో సంభవించనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం పశ్చిమ ఐరోపా, అట్లాంటిక్, ఆర్కిటిక్, మెక్సికో, ఉత్తర అమెరికా (అలాస్కా మినహా), కెనడా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతాలు, ఇంగ్లండ్ వాయువ్య ప్రాంతం మరియు ఐర్లాండ్‌లో కనిపించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం సమయం: ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 09:12 నుండి అర్ధరాత్రి 01:25 వరకు.


సూర్యగ్రహణం వ్యవధి: 4 గంటల 25 నిమిషాలు


రెండో సూర్యగ్రహణం
2024లో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కన్య రాశిలో ఏర్పడనుంది. ఈ గ్రహణం దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతాలు, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్, చిలీ, పెరూ, హోనోలులు, అంటార్కిటికా, అర్జెంటీనా, ఉరుగ్వే, బ్యూనస్ ఎయిర్స్, బెకా ద్వీపం, ఫ్రెంచ్ పాలినేషియా మహాసముద్రం, ఉత్తర అమెరికా దక్షిణ భాగం, ఫిజీ, న్యూ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు, కాబట్టి దాని సూతక్ కాలం చెల్లదు. ఈ సూర్యగ్రహణం కన్య మరియు హస్త రాశిలో ఏర్పడుతుంది. 


సూర్యగ్రహణం సమయం: అక్టోబర్ 2 రాత్రి 09:13 మరియు అర్ధరాత్రి 03:17 గంటల వరకు
సూర్యగ్రహణం వ్యవధి: 6 గంటల 04 నిమిషాలు.


Also read: Shani Dev: శని గ్రహం త్వరలోనే నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి 4 నెలలు లాభాలే లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి