Surya Grahan 2023 negative effect: ఆస్ట్రాలజీలో సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే గ్రహణాన్ని సామాన్య జనం అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధం. అయితే  ఈ సంవత్సరంలో చివరి సూర్య గ్రహణం అక్టోబరు 14న సంభవించబోతుంది. పైగా ఇదే రోజు సర్వపితృ అమావాస్య ఏర్పడుతుంది. ఇది పితృపక్షం ముగింపు రోజు కూడా. ఈరోజున పూర్వీకులందరికీ ప్రత్యేక పూజలు చేసి తర్పణాలు వదులుతారు. రాబోయే సూర్య గ్రహణ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య గ్రహణ సమయం
జ్యోతిష్యుల ప్రకారం, సర్వపిత్రి అమావాస్య రోజున, సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై.. తెల్లవారుజామున 2.25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదు.


మేషరాశి
సూర్యగ్రహణం రోజున మేషరాశి వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరినీ అవమానించవద్దు. మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గొడవలకు దూరంగా ఉండండి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.  ఈ రోజు ఎటువంటి ప్రత్యేక పని చేయవద్దు.
కన్య రాశి
సూర్య గ్రహణం మీకు ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ సమయంలో ఏదైనా ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. వాదనలకు దూరంగా ఉండండి. మీకు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో గొడవలయ్యే అవకాశం ఉంది.


Also Read: Papankusha Ekadashi 2023: పాపాంకుశ ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క విశిష్టత ఏంటి?


సింహరాశి 
గ్రహణ సమయంలో సింహరాశి వారు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు చేయవద్దు. ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు రావచ్చు. మీపై నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. 
ధనుస్సు రాశి
సూర్య గ్రహణం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. మీకు వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో ఎవరితోనైనా గొడవలు రావచ్చు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటలను అదుపులో ఉంచుకుంటే మీకు మంచిది.


Also Read: Mangal Gochar 2023: దసరాకు ముందు ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి