జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఈసారి మేష రాశిలో సూర్య, గురు గ్రహాలు కలిసి యుతి ఏర్పర్చనున్నాయి. ఫలితంగా మేషం, మిధునం, తులా రాశుల వారికి అద్భుత దశ తిరగనుంది. వీరి జీవితంలో ఇక నుంచి మంచి రోజులు ప్రారంభమైనట్టే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మీనరాశిలో ఉన్న గురుడు ఏప్రిల్ 22వ తేదీన గోచారం చేసి..మేషరాశిలో ప్రవేశించనున్నాడు. మరోవైపు ఏప్రిల్ 15వ తేదీన సూర్యుడు కూడా మేషరాశిలో గోచారం చేయనున్నాడు. ఏప్రిల్ 2023లో సూర్యుడి గోచారం, గురు గోచారంతో మేషరాశిలో సూర్య, గురు గ్రహాల యుతి ఏర్పడుతుంది. ఇది 3 రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. 12 ఏళ్ల తరువాత మేషరాశిలో ఏర్పడనున్న సూర్య, గురు గ్రహాల యుతి ప్రభావం ఈ మూడు జాతకులకు చాలా లాభాలు కల్గించనుంది. వీరి జీవితంలో జ్ఞానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సుఖ సంతోషాలు పెరగనున్నాయి. గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి.


సూర్య గురు గ్రహాల యుతితో దశ తిరగనున్న అదృష్టం


మేష రాశి


మేషరాశి జాతకులకు సూర్య, గురు గ్రహాల యుతి శుభప్రదం కానుంది. ఈ జాతకుల జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. పనిచేసేచోట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. నలువైపుల్నించి లాభాలుంటాయి. ఒకేసారి ఊహించని చోటి నుంచి డబ్బులు లభిస్తాయి. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. భాగస్వామితో మంచి సంబంధాలుంటాయి.


మిథున రాశి


సూర్య, గురు గ్రహాల యుతి మిథున రాశి వారికి మంచి రోజుల్ని తెస్తోంది. ముఖ్యంగా కెరీర్‌పరంగా మంచి సమయం. కొత్త ఉద్యోగాలు లభించవచ్చు. కోరినచోటికి బదిలీ కావచ్చు. ధనలాభముంటుంది. వ్యాపారంలో ఏదైనా పెద్ద డీల్స్ చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పెళ్లి జీవితం బాగుంటుంది. 


తులా రాశి


తులారాశి జాతకులకు సూర్య, గురు గ్రహాల యుతి ఊహించని లాభాల్ని ఇస్తుంది. పెళ్లిలో ఏమైనా ఇబ్బందులుంటే దూరమౌతాయి. కుటుంబ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ధనలాభం కారణంగా ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. కెరీర్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది. 


Also read: Sun transit 2023: సూర్య గోచారంతో ఇవాళ్టి నుంచి మార్చ్ 15 వరకూ మీనరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరగనుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook