Sun and Jupiter Conjuction Effects On Zodiac Signs: వేద గ్రంధాల ప్రకారం, అన్ని గ్రహాలు మరియు నక్షత్రరాశులు ఒక్కో రాశిలో నిర్దిష్ట సమయం వరకు సంచరిస్తాయి. గ్రహాల రాజు అయిన సూర్య దేవుడు ఏప్రిల్ 14న మేషరాశిలో సంచరించనున్నాడు. వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 22న అదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దేవగురు బృహస్పతి. సూర్యుడు మరియు బృహస్పతి కలయిక కొన్ని రాశుల వారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య-గురు యుతి ఈ రాశులకు వరం
మేషరాశి - మేషరాశిలో సూర్యుడు-గురువు సంచారం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు కొత్త జాబ్ ఆఫర్ ను పొందుతారు. 
మిథునరాశి- మిథున రాశి వారికి సూర్యుడు మరియు బృహస్పతి కలయిక వల్ల మీరు విశేష ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. బిజినెస్ ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు అపారమైన సంపదను పొందుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 
తులా రాశి- తులారాశి వారికి కూడా ఏప్రిల్ 22న సూర్యుడు-గురుగ్రహ కలయిక వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. వ్యాపారంలో భారీగా డబ్బు మరియు లాభాలు పొందుతారు. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.


Also Read: Shukra Gochar 2023: వృషభరాశిలో శుక్రుడి గోచారం.. వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి