Surya in Ashlesha Nakshatra: ఆశ్లేష నక్షత్రంలో సూర్యుని సంచారం..ఈ రాశులవారికి డబ్బే..డబ్బు..
Surya in Ashlesha Nakshatra: ఆశ్లేష నక్షత్రంలో సూర్యుని సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Surya in Ashlesha Nakshatra: అన్ని గ్రహాలకు రాజుగా సూర్యుడు వ్యవహరిస్తాడు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని తండ్రి, ఆత్మ, ధైర్యానికి సూచికగా భావిస్తారు. సూర్యుడు ఆగస్టు 3న ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించింది. అయితే ఇదే రాశిలో ఆగస్టు 17 వరకు సూర్యుడు ఉంటాడు. దీని కారణంగా 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నక్షత్రంలో జన్మించిన కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయంటే:
మేష రాశి:
ఆశ్లేష నక్షత్రంలో సూర్యుని సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్నవారు కూడా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంచార ప్రభావంతో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్నవారికి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరు భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
వృషభ రాశి:
సూర్యుని సంచారం వృషభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో అదృష్టం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా మీ జీవితంలో సానుకూల సంఘటనలు ఏర్పడడమే కాకుండా ఉద్యోగాలు చేసేవారు ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావింవచ్చు. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు పాత స్నేహితులను కలుసుకునే ఛాన్స్ కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి:
ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల కర్కాటక రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుంది. జీవితంలో సానుకూల అభివృద్ధి కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు మరింత ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook