Surya Mahadasha Effect: వచ్చే 6 ఏళ్ల పాటు మీకు భారీగా ఆదాయం, కెరీర్ లో మంచి పొజిషన్..
Surya Mahadasha: ప్రతి గ్రహానికి తన సొంత ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడి మహాదశ ఆరు సంవత్సరాలు పాటు ఉంటుంది. ఇది శుభ స్థానంలో ఉంటే మంచి ఫలితాలను, అశుభస స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తుంది.
Surya Mahadasha Good Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహానికి మహాదశ మరియు అంతర్దశ ఉంటాయి. గ్రహాల రాజు సూర్యభగవానుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడి మహాదశ కొనసాగుతుందో వారు తక్కువ టైంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీకు జీవితంలో దేనికీ లోటు ఉండదు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. సాధారణంగా సూర్యుడి మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది.
సూర్యుని శుభ ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో సూర్యుడు మహాదశ శుభస్థానంలో ఉన్నప్పుడు మీరు శుభఫలితాలను పొందుతారు. దీంతో మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఊహించని డబ్బును పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
సూర్యుని అశుభ ప్రభావం
మీ జాతకంలో సూర్యుడు బలహీనమైన, నీచమైన లేదా అశుభ స్థానంలో ఉంటే మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మీ కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
ఈ చర్యలు చేయండి..
** సూర్యుని మహాదశలో మీరు చెడు ఫలితాలను పొందినట్లయితే.. ప్రతి ఆదివారం రాగి మరియు గోధుమలను దానం చేయండి.
** రాగి పాత్రలో అక్షత, రోలీ కలిపిన నీటిని సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
** ఆదిత్య హృదయ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి. దీనితో పాటు ఓం హ్రాం హ్రీం హ్రాం స: సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
**ఆదివారం నాడు పీపల్ చెట్టుకు నీరు పోసి... చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం మంచిది.
Also Read: June 2023 Grah Gochar: జూన్‌లో ఊహించని పరిణామం.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి