April Gochar 2023: ఏప్రిల్‌లో `విధ్వంసక యోగం`.. ఈ రాశుల జీవితాల్లో గందరగోళం..
Grah Gochar In April 2023: వచ్చే నెలలో మేషరాశిలో సూర్యుడు, రాహువు కలయిక ఏర్పడుతోంది. ఈ విధ్వంసక యోగం కొన్ని రాశుల వారికి కష్టాలను పెంచబోతోంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Rahu Yuti 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. ఏప్రిల్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఏప్రిల్ 14న సూర్యుడు, 21న బుధుడు, 22న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే మేషరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. మెుదటగా సూర్యుడు, రాహువు కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణఁగా కొన్ని రాశులవారికి కష్టకాలం మెుదలుకానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులవారు జాగ్రత్త
సింహరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సింహ రాశి వారు ఏప్రిల్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి.
వృశ్చిక రాశి
గ్రహణ యోగం వల్ల ఈ రాశి వారికి ఏప్రిల్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీ కెరీర్ లో అనేక సమస్యలు వస్తాయి. మీరు వివాదాల్లో చిక్కుకుంటారు. డబ్బు లావాదేవీలు చేయడానికి ఇది అనుకూల సమయం కాదు. దాంపత్య జీవితంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.
తులారాశి
సూర్యుడు, రాహువు కలయిక తులారాశి వారికి సమస్యలను తెచ్చిపెడుతోంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబంలో మనస్పర్థలు వస్తాయి. వైవాహిక జీవితంలోనూ సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు రాశి
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు వేచి చూడాల్సి వస్తుంది. మీ కష్టాలు పెరుగుతాయి. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. కుటుంబంలో గొడవలు వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫంల దక్కదు.
Also Read: Jupiter set: రాబోయే 28 రోజులపాటు ఈ 3 రాశులవారు జాగ్రత్త.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి