Surya Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. జూలై నెలలో సగం రోజులు అయిపోయాయి. ఇప్పటికే కుజుడు, శుక్రుడు మరియు బుధుడు తమ రాశులను మార్చారు. ఇవాళ సూర్యుడు వంతు వచ్చింది. జూలై 16న ఆదిత్యుడు తన రాశిని మార్చి చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. వచ్చే నెల 17 వరకు ఇదే రాశిలో ఉంటాడు. కర్కాటక రాశిలో సూర్యుడు వెళ్లడం 5 రాశులవారికి బంపర్ ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య సంచారం ఈ 5 రాశులకు వరం
మేషం: మేష రాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ కూడా లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు  తిరిగి వస్తుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. 
వృషభం: వృషభ రాశి వారికి సూర్యుని రాశి మార్పు అనుకూలంగా ఉంటుంది. మీలో ధైర్యం పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. విదేశాల నుండి లాభం పొందుతారు. మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. 
తుల రాశి: సూర్యుని రాశి మార్పు తుల రాశి వారికి కెరీర్‌లో విజయాన్ని ఇస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీకు పెద్ద పదవి లభిస్తుంది. మీరు బిజినెస్ మంచి లాభాలను పొందుతారు. మీ వ్యక్తిగత  జీవితం బాగుంటుంది. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. 


Also Read: Mercury transit 2023: జూలై 25న సూర్యుడి రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..


వృశ్చిక రాశి: సూర్యుని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు దానధర్మాలు చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. 
మీనం: సూర్యుని సంచారం మీకు ఊహించని ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 


Also Read: Shani Margi 2023: త్వరలో కుంభరాశిలో నేరుగా నడవనున్న శని.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook