These 3 zodiac sign lovers will be very lucky due to Malavya Rajyog 2023: జ్యోతిషశాస్త్రంలో సంపద-లగ్జరీ, ప్రేమ-శృంగారానికి కారకంగా శుక్రుడు పరిగణించబడ్డాడు. శుక్రుడు ఓ వ్యక్తి జాతకంలోశుభ స్థితిలో ఉంటే..  జీవితంలో చాలా విజయాలు పొందుతారు. శుక్రుడు ఒక రాశిలో 23 రోజులు ఉంటాడు. ప్రస్తుతం ధనుస్సు రాశిలో శుక్రుడు ఉంటాడు. ఫిబ్రవరిలో కుంభ రాశిలో ఉండగా.. ఆ తరువాత మీనంలోకి సంచరిస్తాడు. 2023 ఫిబ్రవరి 15న శుక్రుడు తన ఉన్నతమైన మీన రాశిలో సంచరించడం (Venus Transit in Pisces 2023) ద్వారా మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలో ఈ రాజయోగం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి:
మిథున రాశి వారికి మాళవ్య రాజయోగం చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కెరీర్‌లో పెద్ద పురోగతి ఉంటుంది. కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ మీ పనితో సంతోషంగా ఉంటారు. పదోన్నతి మరియు జీతం పెరుగుదల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒంటరి వ్యక్తులు వివాహం చేసుకుంటారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందంపై సంతకం చేయవచ్చు.


కన్యా రాశి: 
శుక్రుని సంచారం వలన ఏర్పడిన మాళవ్య రాజయోగం.. కన్యా రాశి వారికి శుభవార్తలు తెస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. ప్రేమ సంబంధంలో ఉన్న జంటలు మరియు వివాహితులకు ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది.


ధనుస్సు రాశి:
మాళవ్య రాజయోగం ధనుస్సు రాశి వారి జీవితంలో బంగారు రోజులను తెస్తుంది. శుక్రుని అనుగ్రహంతో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది. 


Also Read: Makar Sankranti 2023: 2 రోజుల తర్వాత ఈ రాశుల వారు శని బారిన పడతారు.. సంక్రాంతి నాడు తప్పకుండా ఈ పరిహారం చేయండి!  


Also Read: Maruti Brezza CNG: టాటా నెక్సాన్‌కు పోటీగా.. మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ! 25 కిలోమీటర్ల మైలేజ్‌  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.