These 3 Zodiac Sign peoples Lives like a King due to Akhand Samrajya RajYog 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంది. ఈ గ్రహాల మార్పు అన్ని రాశుల వారిపై పెను ప్రభావం చూపుతుంది. శని గ్రహం అతి నెమ్మదిగా కదులుతూ రెండున్నరేళ్ల తర్వాత తన రాశి చక్రాన్ని మారుస్తుంది. ఈరోజు (జనవరి 17) కుంభ రాశిలోకి శని ప్రవేశిస్తోంది. ఇక 22 ఏప్రిల్ 2023న బృహస్పతి కూడా తన రాశిని మారుస్తుంది. శని మరియు బృహస్పతి రాశి మార్పుల ప్రభావం అందరి జీవితాలపై ప్రభావాన్ని చూపుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సంచారము కొన్ని రాశుల వారికి సడే సతి మరియు ధైయాలను తొలగిస్తుంది. దాంతో కొందరు ఉపశమనాన్ని పొందుతారు. మరోవైపు 2023 సంవత్సరంలో శని సంచారమే కాకుండా.. గురు గ్రహ సంచారం 3 రాశుల వారికి గొప్ప శుభాలను ఇస్తుంది. శని సంచారం మరియు గురు సంచారం కలిసి 'అఖండ సామ్రాజ్య యోగం'ను సృష్టిస్తుంది. ఈ యోగం ఈ 3 రాశుల వారికి అపారమైన సంపద, అదృష్టం, సంతోషకరమైన జీవితం మరియు సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజు లాంటి జీవితం ఉంటుంది. 


మేషం:
మేష రాశి వారికి శని సంచారం మరియు గురు సంచారం వల్ల ఏర్పడే అఖండ సామ్రాజ్య రాజయోగం చాలా శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. మేష రాశి వారి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉండవచ్చు. ధనం మీ ఇంటికి వస్తుంది. ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర ప్రమాదకర పెట్టుబడుల నుంచి  లాభం పొందే అవకాశాలు ఉంటాయి. రుణ విముక్తి కలుగుతుంది. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.


మిథునం: 
అఖండ సామ్రాజ్య రాజయోగం మిధున రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. శని సంచారం ఈ స్థానికులకు ధైయా నుంచి స్వేచ్ఛను ఇస్తుంది. బృహస్పతి సంచారం కారణంగా.. అదృష్టం తలుపులు తడుతుంది. మిధున రాశి వారికి ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తుల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ నుంచి లాభం పొందవచ్చు.


మకరం: 
అఖండ సామ్రాజ్య రాజయోగం కూడా మకర రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు రాక భారీగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును పొందడం చాలా ఉపశమనంగా ఉంటుంది. రుణ విముక్తి కలుగుతుంది. తండ్రీ సోదరులతో విభేదాలు తొలగుతాయి. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది.


Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. టాటా పంచ్‌కి ఇక చుక్కలే!


Aso Read: Virat Kohli: విరాట్ కోహ్లీకే అవార్డు ఇవ్వడం కరెక్ట్‌ కాదు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌పై గౌతమ్ గంభీర్‌ అసంతృప్తి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.