Shukra Gochar 2023: హోలీ తరువాత ఈ రాశుల వారికి డబ్బేడబ్బు.. ఏప్రిల్ 6 వరకు బంగారు కాలం!
Gemini, Libra, and Pisces Zodiac Sign Peoples Will Get Huge Money after Holi 2023. మిథున రాశి, తులా రాశి, మీన రాశి వారికి శుక్రుడు మరియు రాహువు కలయిక హోలీ తరువాత కలిసిరానుంది.
These 3 Zodiac Signs Will Get Immense Money after Holi due to Shukra Gochar 2023: కొత్త నెల ప్రారంభంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. గ్రహాలు మరియు నక్షత్ర రాశుల తిరుగుబాటు ప్రభావాలు అన్ని రాశుల వారి జీవితంపై శుభ మరియు అశుభ మార్గాలలో కనిపిస్తాయి. కొన్ని రాశిచక్రాల వారికి ఈ సంచారాలు చాలా శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటాయి. భౌతిక సుఖాలను ఇచ్చే శుక్రుడు మార్చి 12న ఉదయం 8.37 గంటలకు మేష రాశిలో సంచరించబోతున్నాడు. మార్చి 6 ఉదయం 11.10 గంటలకు మేష రాశిలోనే ఉండనున్నాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం రాహు గ్రహం కూడా మేష రాశిలోనే ఉన్నాడు. మేష రాశిలో శుక్రుడు మరియు రాహువు కలయిక అనేక రాశి చక్ర గుర్తుల స్థానికుల జీవితాల్లో శుభ ప్రభావాన్ని చూపుతుంది. మిథున రాశి, తులా రాశి, మీన రాశి వారికి శుక్రుడు మరియు రాహువు కలయిక హోలీ తరువాత కలిసిరానుంది. ఏప్రిల్ 6 వరకు బంగారు కాలం ఉండనుంది. ఈ 3 రాశుల గురించి ఓసారి తెలుసుకుందాం.
తులా రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేష రాశిలో శుక్రుని సంచారం తులా రాశి వారికి చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వివాహిత యువకులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహితుల జీవితం సంతోషంగా మరియు ప్రేమగా గడిచిపోతుంది. పార్టనర్‌షిప్‌తో పనిచేస్తే లాభం ఉంటుంది. అంతేకాదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.
మీన రాశి:
రాహువు, శుక్రుడు కలయిక వల్ల మీన రాశి వారికి ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు మీ మాటపై సంయమనం పాటిస్తే ప్రతిచోటా విజయం ఉంటుంది. బయట తినడానికి, తాగడానికి దూరంగా ఉండటం మంచిది.
మిధున రాశి
మిధున రాశి వారికి శుక్రుడు మరియు రాహువు కలయిక అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం భారీ లాభాలను తెస్తుంది. ఈ సమయంలో వ్యాపారం విస్తరించి పెద్ద ఆర్డర్లు రావొచ్చు. మీరు మీ కంపెనీని విదేశాలలో తెరిచే అవకాశం ఉంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లయితే.. దానిలో కూడా లాభం పొందవచ్చు.
Also Read: iPhone 15 Price: ఐఫోన్ 15 ప్రో డీటెయిల్స్ లీక్.. మొదటిసారిగా సరికొత్త ఫీచర్! సూపర్ లుకింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.