These 3 zodiac signs will get New Job and Huge income in business due to Mercury Rise 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... గ్రహాలు అన్ని ఓ నిర్దిష్ట సమయాల్లో తమ రాశి చక్రాలను మారుస్తాయి. ఈ రాశి చక్రాల మార్పు మనిషి జీవితంలో శుభ మరియు అశుభాలను ఇస్తాయి. ఇక ఏదైనా గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. ఆ గ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది. దాని కారణంగా మనిషి జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సంపద, వ్యాపారం మరియు తెలివితేటలకు కారకుడైన బుధ గ్రహం 12 జనవరి 2023న ధనుస్సు రాశిలోకి (మెర్క్యురీ రైజ్ 2023) ప్రవేశిస్తుంది. మెర్క్యురీ రైజ్ 2023 కొందరికి చాలా శుభప్రదంగా ఉంటే.. మరికొందరికి అశుభంగా ఉంటుంది. ఏ రాశి వారికి బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి:
2023 సంవత్సరం ప్రారంభంలోనే బుధ గ్రహ సంచారం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు డబ్బు పరంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ మాటలతో కూడా పనులు పూర్తవుతాయి. 


కుంభ రాశి: 
బుధ గ్రహ సంచారం కుంభ రాశి వ్యక్తుల ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను ఇస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో తీసుకున్న రుణం తీర్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని కూడా పొందవచ్చు. ఆర్థిక విషయాలలో లాభం మరియు ఉపశమనం సమయం ఉంటుంది.


మీన రాశి: 
బుధ గ్రహ సంచారం మీన రాశి వారి కెరీర్‌లో గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ అనుకూల సమయం ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందవచ్చు. కొత్త ఉద్యోగం కూడా వచ్చే అవకాశం  ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. వ్యాపారాన్ని విస్తీర్ణం చేయడానికి ఇది మంచి సమయం.


Also Read: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు!


Also Read: ఈ చిన్న మొక్క మనీ ప్లాంట్ కంటే అత్యంత ప్రభావమైనది.. ఇంట్లో ఉంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.