Sun Transit in Sagittarius on 2022 December 16: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం... గ్రహాల స్థానాలు చాలా ముఖ్యమైనవి. శుక్ర మరియు బుధ గ్రహాల కలయికకు ముందు ధనుస్సు రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది. 2022 డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి సూర్యుడు సంచరించడంతో 'త్రిగ్రాహి యోగం' ఏర్పడబోతోంది. ధనుస్సు రాశిలో సూర్యుడు మరియు బుధుడి కలయిక కూడా 'బుధాదిత్య యోగం'ను సృష్టిస్తుంది. ధనుస్సు రాశిలో లక్ష్మీనారాయణ యోగం, త్రిగ్రాహి యోగం, బుధాదిత్య యోగం ఏర్పడటం వలన ఈ 4 రాశుల వారికి ఒక వరంలా మారుతుంది. ఆ రాశులు ఏవో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం:
ధనుస్సు రాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులు వారి కెరీర్‌లో పెద్ద పురోగతిని సాధిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. మీ ప్రసంగం చాలా మందిని ప్రభావితం చేస్తుంది. ధన లాభం ఉంటుంది. పొదుపు చేయగలుగుతారు.


తులా:
త్రిగ్రాహి యోగం తులా రాశి వారికి కూడా ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. మార్కెటింగ్, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కెరీర్‌లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కొత్త జాబ్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. మొత్తంగా డబ్బు మరియు కెరీర్ పరంగా చాలా బాగుంటుంది.


ధనుస్సు:
త్రిగ్రాహి యోగం సమయంలో ధనుస్సు రాశిలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉంటారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారు గౌరవం, డబ్బు, పదవి మరియు ప్రేమ పొందుతారు. కార్యాలయంలోని మీ లక్ష్యాలు నెరవేరుతాయి.


మీనం:
త్రిగ్రాహి యోగం మీన రాశి వారికి అన్ని విధాలుగా లాభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉపాధి లభిస్తుంది. కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. రుణాలు అస్సలు తీసుకోకండి. 


Also Read: Andrew Flintoff Accident: ఆసుపత్రిలో ఆండ్రూ ఫ్లింటాఫ్.. ప్రాణాపాయం లేదని తేల్చిన వైద్యులు!


Also Read: BRS Central Office: నేడు ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.