These 5 Zodiac Signs are very lucky due to Mercury Transit 2022: ఈ సంవత్సరంలో చివరి బుధ సంచారం మరో కొన్ని గంటల్లో జరగనుంది. 28 డిసెంబర్ 2022న బుధ సంచారం జరగబోతోంది. బుధుడు తన రాశిని మార్చి మకర రాశిలోకి వెళ్లనున్నాడు. ఇక డిసెంబర్ 31న బుధుడు తిరోగమనంలో కూడా ప్రయాణించనున్నాడు. సంపద, తెలివితేటలు, వ్యాపారం కారకుడిగా బుధుడుని పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ బుధ సంచారము మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
బుధ సంచారం మేష రాశి వారివృత్తి జీవితంలో గొప్ప విజయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు పురోభివృద్ధి, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాలు మారడానికి ప్రయత్నిస్తున్న వారు విజయం సాధిస్తారు. అన్ని పనుల్లో శుభవార్తలు ఉంటాయి. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


వృషభ రాశి: 
వృషభ రాశి వారికి బుధుని రాశి మార్పు చాలా లాభాలను ఇస్తుంది. వృషభ రాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది. కెరీర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ప్రమోషన్‌తో పాటు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు బాగా లాభపడతారు. వివాహాలు కుదిరే అవకాశం ఉంది.


కన్యా రాశి:
కన్యా రాశి వారికి బుధుని సంచారం భారీ ధన లాభాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇప్పటివరకు ఉన్న డబ్బు సంబంధించిన సమస్యలు ముగుస్తాయి. ఈ సమయంలో పెద్ద మొత్తంలో పొదుపు చేయగలుగుతారు. పెట్టుబడికి ఇదే మంచి సమయం. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.


ధనుస్సు రాశి: 
బుధుడు రాశి మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశుల వారు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు. కొత్త వాహనం, భవనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.


మకర రాశి:
బుధుడు మకర రాశిలో సంచరిస్తున్నందున ఈ బుధ సంచారం ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం లేదా పని చేసే వ్యక్తులు పెద్ద ప్రమోషన్ పొందవచ్చు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు!


Also Read: Ginger Health Benefits: శీతాకాలంలో అల్లమే మీ బెస్ట్ ఫ్రెండ్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.