Spirutual: శివయ్యను దర్శించుకుంటే జన్మజన్మాల పాపాలు తొలగిస్తాడు. అందుకే మనం వివిధ తీర్థయాత్రలు చేస్తాం. మన దేశంలో 12 జ్యొతిర్లింగాలు ఉన్నాయి. అవి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే, కేవలం ఒక్క తీర్థయాత్రకు వెళితే 12 జ్యోగిర్లింగాల దర్శనభాగ్యం కలుగుతుందంటే నమ్ముతారా? ఈ ఆలయం ఎక్కడుంది? తెలుసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్లోని భిల్వారాలోని మాన్షపూర్ణ ఆలయమే ఇది. ఇక్కడ ఏకకాలంలో 12 జ్యోతిర్లింగల దర్శనభాగ్యం కలుగుతుంది. దేశనలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. 5 అడుగుల ఎత్తులో ఉండే ఈ శివలింగంలో 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. 


ఈ ఆలయాన్ని 32 ఏళ్ల క్రితం నిర్మించారని, ఇది భిల్వారాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆలయ పూజరి చెప్పారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం కలగడం. ముఖ్యంగా శ్రావణమాసం, శివరాత్రి సమయంలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇక్కడ మూడురోజులపాటు వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారట.


ఇదీ చదవండి: మీ డైట్‌లో విటమిన్‌ ఈ ఆహారాలు తీసుకుంటున్నారా.. అయితే మీ స్కిన్‌ గ్లో మీ సొంతం


అయితే, శ్రావణమాసంలో నెలరోజులపాటు కన్నులపండువగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే దేవుడికి హుండీ ఉండదు. విరాలాలను డిజిటల్ రూపేణా స్వీకరిస్తారట. శ్రావణమాసంలోని వేడుకలకు మాత్రం ఎక్కువ భక్తులు శివయ్య దర్శనానికి వస్తారు. ప్రత్యేకంగా ఈ సమయంలో శివయ్యను రోజుకు మూడుసార్లు అలంకరిస్తారు. ఈ ఆలయంలో ఏకకాలంలో నలుదిక్కుల నుంచి 12 జ్యోతిర్లింగాలు భక్తులు కనిపించడానికి ప్రత్యేకంగా పైకప్పులో అద్దాలు కూడా ఏర్పాటు చేశారట.


ఇదీ చదవండి: ఈ 5 పుల్లని పండ్లు సిరల్లో గడ్డకట్టిన యూరిక్ యాసిడ్‌ను తక్షణమే బయటకు పంపించేస్తాయి..  


ఈ ఆలయ మహిమాన్విత్వాన్ని తెలుసుకుంటున్న ఎందరో భక్తులు ఇక్కడకు చేరుకుంటున్నారు. అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధాంగా ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం కలుగుతుందని అందుకే ఇక్కడకు భక్తుల రద్దీ పెరుగుతుందని ఆలయా భక్తుడు ఒకరు చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter