Thursday Remedies: హిందూమతం ప్రకారం గురువారం అనేది విష్ణువుకు అంకితం. విష్ణువు ప్రసన్నత కావాలంటే..గురువారం నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదంటారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ పంచాగంలో వారంలో ప్రతిరోజూ ఏదో ఒక దేవతకు లేదా దేవుడికి అంకితమే. ఇవాళ గురువారం. గురువారం అనేది విష్ణువుకు అంకితమైన రోజు. ఈ రోజున విధి విదానాలతో పూజలు చేస్తే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అంటారు. ఒకవేళ ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతుంటే..గురువారం నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదంటారు. లేకపోతే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. 


గురువారం నాడు ఇంట్లో తడిగుడ్డ పెట్టకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇంటి ఈశాన్యమూల బలహీనమైపోతుంది. ఇంటి ఈశాన్యమూల అంటే ఆ ఇంట్లో చిన్నవాళ్లు. గురువారం నాడు ఇంట్లో తడిగుడ్డతో క్లీన్ చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. 


గురువారం నాడు వ్రతం ఆచరిస్తారు. గురువారం రోజు ఇంట్లో ఏ సభ్యుడు కూడా పొరపాటునైనా షేవింగ్ చేయకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజు షేవింగ్ చేస్తే ధన వృద్ధి ఆగిపోతుంది.


గురువారం నాడు మహిళలు పొరపాటున కూడా కేశాల్ని కడకకూడదు. అంటే తలస్నానం చేయకూడదు. మహిళల జన్మకుండలిలో గురుడు కారకంగా ఉంటాడు. గురువారం నాడు కేశాలు శుభ్రం చేయడం వల్ల సంతానం, భర్తపై ప్రభావం పడుతుంది. 


గురువారం నాడు గోర్లు కట్ చేయకూడదని అందరికీ తెలిసిందే. గురువారం నాడు గోర్లు కట్ చేస్తే..చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి.


గురువారం నాడు కేశాల్ని పొరపాటున కూడా కట్ చేయకూడదు. జట్టు కత్తిరించడం వల్ల భర్త, పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడటమే కాకుండా..అబివృద్ధిలో కూడా ఆటంకాలు ఎదురౌతాయి.


Also read: Red Chilli-Lemon: ఇంటి బయట ఎండుమిర్చి-నిమ్మకాయ ఎందుకు కడతారో తెలుసా, శాస్త్రీయ కారణమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook