Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. రూ. 300 టిక్కెట్లతోపాటు గదులను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది సదావకాశం. టిక్కెట్లు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు ఈనెల 25  నుంచి రూ.300 దర్శనం టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది టీటీడీ. అయితే, శనివారం మార్చి 23 నుంచి అంగప్రదక్షిణం టోకెన్లకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు ఆ రోజు నుంచే శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం టిక్కెట్లను కూడా విక్రయించనుంది. మధ్యాహ్నం సమయం నుంచి దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. గదుల కోటాను కూడా ఈరోజు విడుదల చేయనున్నట్లు టీటీడీ యాజమాన్యం తెలిపింది. తిరుమల వెళ్లే భక్తులు వెంటనే బుక్‌ చేసుకుంటే దర్శనానికి మార్గం సుగమం అవుతుందని చెప్పింది. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నెల 27 నుంచే నవనీత సేవ, శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటా కూడా అందుబాటులో ఉండనుంది.


ఇదీ చదవండి: మేషరాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారబోతోంది..


ఇక తిరుచానూరు ఆలయానికి వెళ్లే భక్తులు కూడా శుభవార్త. టీటీడీ అధికార యాంత్రాగం కోట్లవ్యయంతో ఇక్కడ కూడా క్యూకాంప్లెక్సు నిర్మాణాలు చేపడుతోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్తున్న భక్తుల తాకిడీ ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల మాత్రమే కాదు, తిరుచానూరు దేవాలయ ప్రాంగణంలో కూడా క్యూకాంప్లెక్సులు నిర్మంచనుంది. ఇది భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉంటుంది.  అయితే, ఈ నిర్మాణానికి ఏడాది సమయం పడుతుందని టీటీడీ ఇంజినీరింగ్ శాఖ తెలిపింది. కల్యాణ కట్ట, వెయిటింగ్ హాల్, టిక్కెట్ కౌంటర్, సెక్యూరిటీ పాయింట్ ఈ నిర్మాణం ద్వారా అందుబాటులోకి వస్తాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 


ఇదీ చదవండి: కెమికల్స్ రహిత హోలి రంగులు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook