TTD Tickets: త్వరపడండి.. నేడే తిరుమల అంగప్రదక్షిణ, ప్రత్యేక టికెట్లు విడుదల
TTD Special Tickets: భక్తుల్లారా త్వరపడండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల టికెట్లను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. స్వామివారి కృపలో పాత్రులు కావాల్సిన వారు ముందే టికెట్లు బుక్ చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది.
Tirumal Tickets Released: తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. ఏప్రిల్-2024 నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన, పూజా కార్యక్రమాల టికెట్లను బుధవారం అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాటితో పాటు అంగ్ర ప్రదక్షిణ టికెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇక తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
కాగా భక్తులకు ఒక విన్నపం. ఇటీవల టీటీడీ వెబ్‌సైట్ మార్పు చేసింది. కొత్తగా ప్రకటించిన టీటీడీ వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పేరిట చాలా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నాయని.. వాటిని ఆశ్రయించి మోసపోకూడదని చెబుతున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్న టికెట్లకే తిరుమల, తిరుపతిలో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook