Today's Horoscope February 5 2022: నేటి (శనివారం 2022 ఫిబ్రవరి 5 ) రాశి ఫలాలను ఓసారి గమనిస్తే.. కొన్ని రాశుల వారికి మంచి సమయం ఉంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aries - మేషం: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో కుటుంబసభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.


Taurus - వృషభం: అన్ని రంగాల వారు ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందులకు గురవుతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.


Gemini - మిథునం: ప్రారంభించిన కార్యక్రమాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.


Cancer - కర్కాటకం: ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రులతో చనువుగా ఉండవద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ దర్శనం మంచి ఫలితాన్నిఇస్తుంది.


Leo - సింహం: పనులను ప్రణాళికతో పూర్తి చేశారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. విందూవినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి దర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.


Virgo - కన్య: సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.


Libra - తుల: దైవబలం ఉంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేశారు. ఇష్టదైవారాధన మరిన్ని శుభాలను చేకూరుస్తుంది


Scorpio - వృశ్చికం: ప్రారంభించిన పనులలో వెంబకడుగు వేయొద్దు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. మిశ్రమకాలం నడుస్తోంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచింది. శివారాధన చేయాలి.


Sagittarius - ధనుస్సు: పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.


Capricorn - మకరం: శ్రమ బాగా పెరుగుతుంది. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మేలు చేకూరుతుంది.


Aquarius - కుంభం: ప్రయత్నాలు చేస్తేనే విజయాలు దక్కుతాయి. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.విందువినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.


Pisces - మీనం: బుద్ది బలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.


Also Read: IPL 2022 Auction: బెంగళూరు కెప్టెన్‌ రేసులో ఆరుగురు.. అవకాశం ఎవరికి దక్కనుందో మరి?


Also Read: Tirumala Updates: ఫిబ్రవరి 15 తర్వాత శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook