Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 08 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి శుభవార్తలు అందుతాయి
Today Horoscope In Telugu 08 June 2021: ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం ఉంది కనుక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
Horoscope Today 08 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 08వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీ అభిప్రాయాలను మీతోనే ఉంచుకోవడం మంచిది. మీరు నియంత్రణలో ఉండాలి. పనిచేసే చోట ఉద్యోగులు ప్రశాంతంగా ఉండాలని, ఇతరులతో మాట్లాడకూడదని సలహా ఇస్తున్నారు. మీ జీవిత భాగస్వామితో సరదాగా సమయాన్ని గడుపుతారు. పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులకు ఇది తగిన సమయం. కొన్ని శుభవార్తలు అందుతాయి.
వృషభ రాశి
ఈ రోజు నమ్మకమే మీ పనిని సులభతరం చేస్తుంది. ఇదివరకే ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే కూడా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనవ్యయం గోచరిస్తుంది. ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
మిథున రాశి
ఈరోజు మీకు చంద్రుని ఆశీర్వాదం ఉంది కనుక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి
కొన్ని విషయాలు మిమ్మల్ని బాధిస్తాయి. అయితే దీనిపై ఎక్కువగా ఆందోళన చెందవద్దు. కొన్ని శుభవార్తలు అందుతాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో మీలో ఉత్సాహం రెట్టింపవుతుంది. కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు మీ కుటుంబం అధికారం ఇస్తుంది.
సింహ రాశి
పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. గృహిణులు వారి రోజువారీ పనుల నుండి విరామం తీసుకుంటారు. రుణాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అధికంగా శ్రమించినా ఫలితాలు త్వరగా అందుకోలేరు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం.
Also Read: Sun Halo Spotted in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం, Photo Gallery
కన్య రాశి
ఇంటికి సంబంధించిన కొన్ని పనులకు అధిక సమయాన్ని కేటాయిస్తారు. కీలక పనులు మధ్యలోనే వాయిదా వేసుకుంటారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం అవుతాయి. సన్నిహితులు, బంధువులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహిస్తారు.
తులా రాశి
మీరు మీ దాయాదులతో కొన్ని గొప్ప జ్ఞాపకాల కోసం ఆశపడతారు. తయారీదారులు మరియు ఆస్తి అమ్మకందారులకు ఈ రోజు సానుకూల పరిస్థితి ఉంది. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.
వృశ్చిక రాశి
మీరు పొదుపుపై ఫోకస్ చేసి, ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని యత్నిస్తారు. ఇంట్లో ఉద్భవిస్తున్న సంక్లిష్ట స్థితిని నివారించడంలో విజయం సాధిస్తారు. మీరు క్లెయిమ్ చేసిన ఆస్తి ద్వారా గొప్ప రాబడిని పొందుతారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. నూతన పెట్టుబడుల కోసం వ్యాపారుల ఎదురుచూపులు.
ధనుస్సు రాశి
విషయాలను దాచిపెట్టే మీ స్వభావం, కుటుంబంలోని పెద్దలలో అనుమానాలు రేకెత్తిస్తుంది. కాబట్టి మీరు చేసే పనులను కుటుంబసభ్యులకు చెప్పడం శ్రేయస్కరం. తిండి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో మీరు చేసిన కొన్ని పనులు మీ కంపెనీకి ప్రయోజనకరంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో చర్చించి సలహాలు తీసుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు.
Also Read: Hanuman Jayanthi 2021 Date: తిరుమలలో నేటి నుంచి 5 రోజులపాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు
మకర రాశి
కొందరు వ్యక్తులు మీ ఇంటికి వస్తారు. కొన్ని శుభకార్యాల గురించి చర్చలు జరుపుతారు. ప్రస్తుతం ఉన్న మీ ఆస్తి నుండి మరింత సంపద వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. అకారణంగా మీరు నగదును ఇతరులకు ఇవ్వకూడదని గ్రహిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి
నేడు కుటుంబం మీకు అండగా ఉంటుంది. సమస్యలు పరిష్కరించుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఆస్తిలో బేరం కుదుర్చుకోవడానికి ఈ రోజు సరైన సమయం. శారీరక శ్రమ ద్వారా అనారోగ్య సమస్యలకు దూరమవుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులు పనిలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు.
మీన రాశి
ఈ రోజు మీరు కుటుంబంతో కలిసి పనులు చేయాల్సి వస్తుంది. సంపద లేదా ఆస్తి వారసత్వం ద్వారా కొంతమందికి సంక్రమిస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కుటుంబంలో వివాదాలు, చికాకులు. ఒత్తిడిని జయిస్తే విజయం మీదే. పనిచేసే చోట ఉద్యోగులకు పనిభారం అధికం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook