Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 11 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి అనారోగ్యం, నష్టాలు
Today Horoscope In Telugu 11 June 2021: అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. మీ అవసరానికి సరిపోయే ఆస్తి వ్యవహారంలో ప్రతిపాదన ఎదురవుతుంది. కొందరు మిత్రులు మిమ్నల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.
Horoscope Today 11 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 11వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
విద్యార్థులు పరీక్షలలో అగ్రస్థానంలో నిలుస్తారు. లేదా ఏదైనా పోటీలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు చాలా మంచిగా నడుచుకుంటారు. మీకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.
వృషభ రాశి
రోజువారీ పనుల నుండి ఉపశమనం పొందటానికి ఒక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు, యువకుల సాధన కుటుంబానికి గర్వకారణంగా మారుతుంది. పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఉద్యోగులకు ఆశించిన విధంగా ఉండదు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
మిథున రాశి
అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. మీ అవసరానికి సరిపోయే ఆస్తి వ్యవహారంలో ప్రతిపాదన ఎదురవుతుంది. కొందరు మిత్రులు మిమ్నల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. యువకులకు ఉద్యోగావకాశాలు.
కర్కాటక రాశి
మీ ఆర్థిక పరిస్థితి సమీక్షించుకోండి. నగదును ఆదా చేయండి. అనవసర విషయాలకు ఖర్చు చేయకూడదని నిర్ణయించుకుంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడానికి ప్రయాణాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చికాకు కలిగిస్తాయి.
సింహ రాశి
ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు సర్దుబాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ ఖర్చులు అధికం కానున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాలలో మార్పు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
కన్య రాశి
కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. కొన్ని పనులలో జాప్యం జరిగినా వెనక్కి తగ్గకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలి. కెరీర్ గురించి ఆలోచిస్తున్న ప్రొఫెషనల్స్ సరైన పనిని పొందటానికి చాలా ఆలస్యం కావచ్చు. ఇంట్లో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.
తులా రాశి
రోజువారీ తీరికలేని పనుల నుంచి విరామం తీసుకోవాలనుకుంటారు, ఇందుకోసం ఓ విహారయాత్రను ప్లాన్ చేస్తారు. మీ కుటుంబంలో ఒక వివాహం జరగడానికి అవకాశం ఉంది. ఖర్చులు అధికం కానున్నాయి. ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వారు ప్రణాళికా బద్దంగా నడుచుకోవాలి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి
మీరు క్లెయిమ్ చేసిన ఆస్తి గొప్ప రాబడిని ఇవ్వడం ప్రారంభించవచ్చు. ప్రయాణాలు చేయాలని భావిస్తారు. అనారోగ్య సమస్యలు కుటుంబసభ్యులను బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. ఓ విషయంలో సన్నిహితులు, బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పని భారం అధికం అవుతుంది.
ధనుస్సు రాశి
మీరు ప్రారంభించిన ఓ ప్రాజెక్టు ఉత్పాదకతను పొందుతుంది. ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. ఆస్తుల అమ్మకాల గురించి పదే పదే ఆలోచిస్తారు. ఆరాధన మరియు ఆధ్యాత్మికత సమయం ప్రారంభమవుతుంది. ఉద్యోగులకు పనిచేసే చోట సహకారం అందుతుంది.
మకర రాశి
కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటారు. శారీరక శ్రమ చేయడం, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. మీరు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆస్తి వివాదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
కుంభ రాశి
చాలా కాలం క్రితం బుక్ చేసుకున్న ఇంటి యాజమాన్యం మీ చేతుల్లోకి రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారవేత్తలకు ఇది మంచి రోజు, నేడు మెరుగైన ప్రయోజనాలు పొందనున్నారు.
మీన రాశి
వంశపారపర్యంగా వచ్చే డబ్బు మీ చేతికి అందదు. కొద్దిమందికి ఇలాంటి విషయాలు ఫలితాన్ని అందించవు. పనిచేసే చోట ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook