Horoscope Today July 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. నిరుద్యోగులు, ప్రేమిలకు శుభకాలం!
Daily Astrological prediction for July 4 2022. వృశ్చికం, సింహం, కుంభ రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రాశుల వారి రాశుల విద్యార్థులకు శుభకాలం నడుస్తోంది.
Today Horoscope July 4 2022: మేషం ( Aries): శుభకాలం నడుస్తోంది. వ్యాపార రంగంలోని వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఓర్పు చాలా అవసరం. పై అధికారులు మీపట్ల దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. గృహిణులు కుటుంబం కోసం ఏదైనా ప్లాన్ చేయవచ్చు. విద్యారంగంలో కొందరికి చాలా ఆనందం ఉంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. శని ధ్యానం శుభప్రదం.
వృషభం (Taurus): మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు త్వరలో సమసిపోన్నాయి. పనిలో శ్రమ పెరిగినప్పటికీ అంకున్నది సాధిస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారు కోలుకునే అవకాశం ఉంది. ప్రేమికులకు కలిసొచ్చే రోజు. ధ్యానం శుభప్రదం.
మిథునం (Gemini): ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి చేపట్టే ప్రతి పనిలో ప్రేరణ లేకపోవచ్చు. మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వివాదాన్ని పరిష్కరించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. త్వరలో ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం మీకు రావచ్చు. శివ అష్టోత్తరం చదివితే బాగుంటుంది.
కర్కాటకం (Cancer): ఇంటికి సంబంధించి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మంచి మనస్సుతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యపరంగా మీకు బాగుంది. ధన వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి విషయంలో మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబడుతుంది. విద్యారంగంలోని వారికి శుభకాలం. శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మంచినిస్తుంది.
సింహం (Leo): అనుకూలమైన సమయం నడుస్తోంది. వ్యాపార రంగంలోని వారికి శుభకాలం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి రోజు. అందరి ప్రశంసలను అందుకుంటారు. ఆస్తి ఒప్పందానికి ఇది అనుకూలమైన రోజు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ చదవండి.
కన్య (Virgo): మిశ్రమ కాలం మారుస్తోంది. అన్ని రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం మంచినిస్తుంది.
తుల (Libra): అన్ని రంగాలలోని వారికీ శ్రమ పెరుగుతుంది. కష్టపడితే ఫలితాలు ఉన్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీరు పూర్తి చేయాలనుకుంటున్న పనికి బయటి సహాయం అవసరం కావచ్చు. విహారయాత్రకు ప్లాన్ చేసుకునే వారికి చాలా ఆనందం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
వృశ్చికం (Scorpio): అనుకున్న ఫలితాల కోసం బాగా శ్రమించాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యారంగంలోని వారికి అనుకూల సమయం. హనుమత్ ఆరాధనా శ్రేయోదాయకం.
ధనస్సు (Sagittarius): ఆర్థికంగా అనుకూల సమయం. అన్ని రంగాల్లోని వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం వెళుతారు. ఈ రోజు అత్యంత ఆనందదాయకంగా ఉండవచ్చు. విశ్రాంతి కోసం విహారయాత్రను ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.
మకరం (Capricorn): ఆర్థిక లాభాలు ఉన్నాయి. బిల్డర్లు మరియు ప్రాపర్టీ డీలర్లకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఒక వార్త మీ కుటుంబంలో ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. అన్యదేశ విహారయాత్రలో ఉన్న వారికి ఒక చిరస్మరణీయమైన అనుభవం ఉంది. ఇష్ట దైవాన్ని స్మరించుకోండి.
కుంభం (Aquarius): ఆర్ధిక లాభాలు ఉన్నాయి. ఓ శుభవార్త అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ పని చేసినా కుటుంబం అండ ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ప్రేమికులకు కలిసొచ్చే రోజు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
మీనం (Pisces): శుభకాలం నడుస్తోంది. మీ స్వంత ప్రయత్నాలు ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక ప్రశాంతతను సాధించడంలో సహాయపడతాయి. మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. జూదం లాంటి వాటిలో డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం.
Also Read: PM Modi: పోరు గడ్డ నుంచి రూట్ మార్చిన పీఎం మోదీ..రాజకీయాలు లేకుండా ప్రసంగం..!
Also Read: Kishore Das Died: నటుడి ప్రాణం తీసిన క్యాన్సర్, కరోనా..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook