Horoscope Today June 6 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ప్రాణహాని ఉంది!
Daily Astrological prediction for June 6 2022. కన్య రాశి రియల్టీ మార్కెట్‌లో ప్రాపర్టీ డీలర్లు హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.
Today Horoscope June 6 2022: మేషం ( Aries): మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం ఈరోజు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. కుటుంబం విషయంలో పరుషమైన మాటలు మిమ్మల్ని బాధించవచ్చు. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. విదేశాల్లో చదువుతున్న వారికి సాఫీగా సాగుతుంది. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.
వృషభం (Taurus): అన్ని రంగాల వారికి సానుకూల అవకాశాలు ఉన్నాయి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పూర్తి ఫిట్‌నెస్ సాధించగలుగుతారు. టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
మిథునం (Gemini): డబ్బుకు ఎలాంటి సమస్యలు ఉండదు. అవసరానికి తగిన సాయం అందుతుంది. చేసే పనిలో అలసట పెరుగుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. వృత్తిపరమైన రంగాలలో మీ కోసం వెనుదిరిగి చూడాల్సిన పని లేదు. స్నేహితులు లేదా బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ ధ్యానం చేయండి.
కర్కాటకం (Cancer): మీ మీ రంగాల్లో గొప్ప ఫలితాలను సాధిస్తారు. వైద్య లేదా న్యాయవాద వృత్తుల వారికి ధనలాభం కలుగుతుంది. కొందరికి వ్యాపార రంగంలో మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. సుఖ సౌఖ్యాలు కలవు. మీ ప్రయాణ ప్రణాళికలను ఎటువంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
సింహం (Leo): మీ ఆర్థిక పరిస్థితిని మెరుగవుతుంది. తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణ సూచన ఉంది. కొందరికి విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. స్థిరాస్తి రంగంలో ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య (Virgo): శుభ ఫలితాలున్నాయి. యువకులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారులచే ప్రశంసలు అందుకంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. రియల్టీ మార్కెట్‌లో ప్రాపర్టీ డీలర్లు హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.
తుల (Libra): చేపట్టే పనుల్లో శ్రద్ధ బాగా అవసరం. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.
వృశ్చికం (Scorpio): మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయవచ్చు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ధన వ్యయం ఉంది. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.
ధనస్సు (Sagittarius): ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ప్రయాణానికి వెళ్లే వారు తగిన విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఆస్తి విభజన అందరికి సంతృప్తికరంగా ఉంటుంది. ఒక శుభవార్త మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ సందర్శనం శుభప్రదం.
మకరం (Capricorn): ప్రతికూల సమయం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. దక్షిణామూర్తి స్తోత్రము చదివితే మంచిది.
కుంభం (Aquarius): అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టండి. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళతారు. నూతన వస్తువులను కొంటారు. ప్రయాణాలకు అంతరాయం కలగవలసి రావచ్చు. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
మీనం (Pisces): బాగా కష్టపడితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొత్త వెంచర్ విషయంలో మీరు విజయం సాధిస్తారు. ఆస్తి వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు చదువు లేదా క్రీడల్లో రాణిస్తారు. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు జంక్ ఫుడ్ మీ శత్రువుగా మారే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
Also Read: Karan Johar Birthday: కరణ్ జోహర్.. పార్టీ ఇచ్చావా లేదా కరోనా వైరస్‌ను ఇచ్చావా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook