Today Horoscope March 20 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి!!
March 20 2022, Daily Horoscope. వృషభం, మిథున రాశుల వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
March 20 2022, Daily Horoscope: మేషం ( Aries): పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆపదలను తొలగించుకునేందుకు గోవింద నామాలు చదవాలి.
వృషభం (Taurus): మీ మీ రంగాల్లో పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి. నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం.
మిథునం (Gemini): సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. లక్ష్మీ దర్శనం ఉత్తమం.
కర్కాటకం (Cancer): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.
సింహం (Leo): అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.
కన్య (Virgo): శుభకాలం నడుస్తోంది. చిత్త శుద్ధితో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారులతో ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.
తుల (Libra): ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్దిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంకు సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సు.
వృశ్చికం (Scorpio): శుభసమయం నడుస్తోంది. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన మంచిది.
ధనస్సు (Sagittarius): మనోధైర్యంతో ముందుకు సాగితేనే పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.
మకరం (Capricorn): ప్రారంభించేబోయే పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. హనుమాన్ చాలీసాతో మంచి ఫలితాలు పొందగలుగుతారు.
కుంభం (Aquarius): మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
మీనం (Pisces): ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక కీలక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
Also Read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!
Also Read: Shalini Pandey Pics: అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook