Today Horoscope May 17 2022: మేషం ( Aries): ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనో ధైర్యంతో ముందుకు సాగితే విజయం సాధ్యమవుతుంది. అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అతిగా ఎవరినీ నమ్మకండి. చంద్ర ధ్యానం ఉత్తమం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): నూతనంగా ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. గొడవల జోలికి పోరాదు. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.


మిథునం (Gemini): మీ వృత్తిలో అధికారుల సహాయంతో పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ధననష్టాన్ని అధిగమించుటకు రుణప్రయత్నం చేస్తారు. ఇష్టదైవారాధన మంచిది. 


కర్కాటకం (Cancer): ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓ శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.


సింహం (Leo): మీ మీ రంగాల్లో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరిక అనారోగ్యంతో ఉంది. కుటుంబంలో విషయాలు సంతృప్తికరంగా ఉండవు. అధిక ధన వ్యయం ఉంది. శని ధ్యానం చేయాలి.


కన్య (Virgo):  పనులు సకాలంలో జరుగుతాయి. చాలా ఆనందంగా ఉండారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


తుల (Libra): నూతనంగా ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఉన్నాయి. పెద్దల నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు, మిత్రులతో ఆనందంగా ఉంటారు. ధన వ్యయం తప్పకపోవచ్చు. దత్తాత్రేయ స్తోత్రం మేలు చేస్తుంది.


వృశ్చికం (Scorpio): పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. దైవదర్శనం ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోవాలి. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం మంచిది.


ధనస్సు (Sagittarius): భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. కుటుంబంతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శివ నామస్మరణ ఉత్తమం.


మకరం (Capricorn): చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ అధికం అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచిది.


కుంభం  (Aquarius): స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకూడదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైరాధన మేలు చేస్తుంది.


మీనం (Pisces): పనుల్లో విజయాలు అందుకంటారు. అకస్మిక ధనలాభముంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు.  ఓర్పు, సహనంతో ముందుకు వెళ్లండి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.


Also Read: IPL PBKS Vs DC: 'డూ ఆర్ డై మ్యాచ్‌'లో ఢిల్లీ గెలుపు... పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు...


Also Read: Karate Kalyani Face To Face: జీ తెలుగు న్యూస్‌తో కరాటే కళ్యాణి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook