Horoscope Today: 16-01-2022 ఆదివారం.. మీ రాశి ఫలాలు! వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!
మిథున రాశి వారికి శుభకాలం నడుస్తోంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
Today's Horoscope January 16 2022: మేషం: శుభకాలం నడుస్తోంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మేలు చేస్తుంది.
వృషభం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగితే ఫలితాలు వస్తాయి. డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
మిథునం: శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం: వృత్తిరీత్యా శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మాట పడాల్సి వస్తుంది. ఏమాత్రం సహనం కోల్పోవద్దు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శత్రువులకు దూరంగా ఉండండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
సింహం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటారు. ఇష్టదేవత దర్శనం ఉత్తమం.
Also Read: Viral Video: నువ్వు నన్ను కెలికితే..నేనెందుకు ఊరుకుంటాను, వైరల్ అవుతున్న వీడియో
కన్య: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త ఒకటి వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఈశ్వరదర్శనం ఉత్తమం.
తుల: నూతనంగా ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. కుటుంబంతో గడుపుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.
వృశ్చికం: భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. సాయిబాబా సచ్చరిత్ర చదవడం మంచిది.
ధనుస్సు: నూతన పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
మకరం: ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
Also Read: Bizarre News: చెవిలో బొజ్జింకతో మూడ్రోజులు నరకయాతన, ఆ తరువాత ఏమైంది
కుంభం: మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
మీనం: మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబంతో సరదాగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook