Tortoise Ring Facts: చాలామంది వేళ్ళకి వివిధ రకాల ఉంగరాలను ధరించడం మనల్ని తరచుగా చూస్తూ ఉంటాం. మరి కొంతమంది అయితే జన్మనామాల ప్రకారం, జాతకాల ని దృష్టిలో పెట్టుకొని వాటి పరిహారాల కోసం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. దీనివల్ల అదృష్టం సహకరించి ధనవంతులు అవుతారని నమ్ముతారు. కొంతమంది అయితే దేవుని బొమ్మలతో తయారు చేసిన ఉంగరాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనం తరచుగా చాలామంది వేళ్ళకి తాబేలు ఉంగరాన్ని చూసి ఉంటాం. నిజానికి తాబేలు ఆకారంలో ఉండే ఉంగరాన్ని ధరించడం ఎంతో శుభప్రదం అని కొంతమంది జ్యోతిష్య శాస్త్రానిపుణులు చెబుతున్నారు. ఈ తాబేలు ఉంగరాన్ని ధరించిన వారు తప్పకుండా కొన్ని సూచనలు సలహాలు పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా కొన్ని తప్పులు చేయడం మానుకోవడం కూడా మంచిదని వారు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి తాబేలు ఉంగరాన్ని కుబేరుడితో పోలుస్తారు. కాబట్టి ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల జీవితంలో అనేక లాభాలు కలుగుతాయి. దీంతోపాటు ఊహించని విజయాలను కూడా సాధిస్తారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం పెట్టుకున్న తర్వాత జాగ్రత్తలు పాటించడం కూడా చాలా మంచిది. దీనిని ఇష్టానుసారంగా పెట్టుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంతో నిష్టగా తాబేలు ఉంగరాన్ని ధరించిన వల్ల జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. ఈ ఉంగరాన్ని పెట్టుకునేవారు కేవలం మధ్యన వేలుకు లేదా చూపుడు వేలుకు ధరించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


అలాగే ఈ తాబేలు ఉంగరాన్ని ఎప్పుడు ధరించిన కుడి చేతికి మాత్రమే ఉండేటట్లు చూసుకోండి.. తాబేలు ముఖం మన ముఖానికి ఎదురెదురుగా ఉండేటట్లు ఉంటే జీవితంలో మంచి లాభాలు పొందగలుగుతారు. అదే ఈ ఉంగరం వ్యతిరేక దశలో ఉంటే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఉంగరాన్ని ధరించేవారు ఏ రోజు పడితే ఆ రోజు వేలుకి పెట్టుకోవడం అంత మంచిది కాదని వారు అంటున్నారు. దీనిని ధరించే వారు కేవలం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు శుక్రవారం ధరించడమే మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలామంది దీనిని బంగారంతో తయారు చేయించుకొని పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి పంచదాతువు వెండి ఇతర కొన్ని లోహాలతో తయారు చేసిన ఉంగరాలను మాత్రమే ధరించడం ఎంతో మంచిదని వారంటున్నారు. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఉంగరాన్ని పెట్టుకునే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ధరించే ముందు తప్పకుండా పచ్చి పాలలో ఐదు నిమిషాల పాటు నానబెట్టి ధరించడం ఎంతో శుభప్రదం. అలాగే తప్పకుండా ఈ ఉంగరాన్ని ధరించే ముందు లక్ష్మీదేవికి పూజ చేయాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహానికి పూజ చేస్తూ ధరించడం ఎంతో మంచిది తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లో సంపద ఒక్కసారిగా పెరుగుతుంది. అంతే కాకుండా వ్యాపారాల్లో నష్టాలు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం. అలాగే ఈ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా కాస్త ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.