Lunar Eclipse 2022: కార్తీక పూర్ణిమ నాడు చంద్రగ్రహణం.. ఈరోజు ఎప్పుడు స్నానం చేయాలో తెలుసా?
Lunar Eclipse 2022: చంద్రగ్రహణం యొక్క సూతకం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతోంది.
Chandra Grahan 2022: ఈసారి కార్తీక పూర్ణిమ నాడు సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మరోవైపు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కార్తీక పూర్ణిమ రోజున చంద్రగ్రహణం కారణంగా ఈసారి దేవ్ దీపావళిని ముందు రోజైన నవంబర్ 7, 2022న జరుపుకుంటారు. పౌర్ణమి నవంబర్ 7వ తేదీ సాయంత్రం 4:18 గంటలకు ప్రారంభమవుతుంది. దీని కంటే ముందు సూతక కాలం ఉదయం 6.39 గంటలకు మెుదలవుతుంది.
ఈ సారి చంద్రగ్రహణం నవంబరు 8న వస్తుంది. దీనికి 9 గంటలకు మందు సూతకాలం ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో అంటే ఉదయం పూట గంగానదిలో స్నానం చేయవచ్చు. అలాగే నవంబర్ 9న కూడా గంగానదిలో స్నానం చేయవచ్చు. కార్తీక పూర్ణిమ రోజు దానం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. గ్రహణం కారణంగా ఈ సారి దీపాన్ని నవంబర్ 6 మరియు నవంబర్ 7 తేదీల్లో దానం చేయవచ్చు.
చంద్రగ్రహణం 2022 సమయం: నవంబర్ 8న సాయంత్రం 5.28 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 7.26 గంటలకు ముగుస్తుంది.
మేషరాశిలో చంద్రగ్రహణం: ఈసారి మేషరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో, ఈ రాశి ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు.
ఈ పనులు చేయకండి: గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడకూడదు. అదే సమయంలో సూతక కాలం ప్రారంభమైన తర్వాత పూజలు మొదలైన మతపరమైన పనులు చేయకూడదు. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు.
Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం వేళ ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా మరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook