Jupiter transit 2024 effect: గ్రహాలన్నింటిలోకెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. దేవతల గురువు బృహస్పతి పేరు మీద ఈ గ్రహానికి నామకరణం చేశారు. జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహాన్ని శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. ఇతడిని జ్ఞానం, వివాహం, సంతానం, సంపదకు కారకుడిగా భావిస్తారు. బృహస్పతి ఏడాది ఒకసారి తన రాశిని మారుస్తుంది. గతేడాది గురుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. మళ్లీ సంవత్సరం తర్వాత అంటే 2024 మే 01న దేవగురు మేషరాశి నుంచి వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. గురుడు యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి
దేవగురు రాశి మార్పు కారణంగా మిథునరాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీ దాంపత్య జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఈ సమయంలో శుభవార్త వింటారు. మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. 
వృషభ రాశి
ఇదే రాశిలోకి బృహస్పతి ప్రవేశించనున్నాడు. దీంతో వృషభరాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఏదైనా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీకు కష్టకాలంలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Chandra Grahan 2024: చంద్ర గ్రహణం రోజు ఇలా చేస్తే.. మీ సమస్యలన్నీ దూరం, ఊహించనంత డబ్బు మీ సొంతం..


సింహ రాశి
బృహస్పతి స్థానం కారణంగా సింహరాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. ఉద్యోగ మరియు వ్యాపారులు లాభపడతారు. విద్యారంగానికి సంబంధించిన వారు మంచి ఫలితాలను పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉండబోతుంది. 


Also Read: Astrology: మార్చి 07 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter