Transit Of Mars In 2023: పాలకు కారకుడైన శుక్ర గ్రహం ఈ రోజు ఉదయం 4 గంటలకు సింహరాశిలోకి సంచారం చేసింది. పురాణాల ప్రకారం శుక్రుడిని అసురులకు రాజుగా చెప్పుకుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, విలాసానికి సూచికగా భావిస్తారు. ఇదే క్రమంలో శుక్రుడు జులై 23వ తేదీ నుంచి తిరోగమన దశలో సంచారం సాగిస్తాడు. తర్వాత ఆగస్టు 7వ తేదీన కర్కాటక రాశిలోకి శుక్రుడు చేరుకుంటాడు. ఈ మొత్తం ప్రక్రియను జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక సంఘటనగా పేర్కొంటారు. ఈ సంచార క్రమంలో శుక్రుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా మరికొన్ని రాశుల వారిపై పరోక్షంగా పడుతుంది. దీని కారణంగా చాలా రాశుల వారు ప్రయోజనాలు పొందితే.. మరి కొన్ని రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై శుక్రుడి ప్రభావం:
మేషరాశి:

ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనంద జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శుక్రుడి సంచారం కారణంగా మేష రాశి వారికి ఇతరుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా విముక్తి లభిస్తుంది.


వృషభ రాశి:
శుక్రుడు వృషభ రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తాడు. దీని కారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి హెచ్చుతగ్గులు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పోటీ పరీక్షలకు హాజరైతున వారు మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారు డ్రైవింగ్ చేసే క్రమంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో


మిథునరాశి:
మిధున రాశి వారికి శుక్రుడు సంచారం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. ఇక వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో హెచ్చుతగ్గులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కుజుడు సంచారం కారణంగా ఖర్చులు పెరుగుతాయి. వీరు ఈ క్రమంలో ఆదాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు కష్టపడి పనిచేయడం వల్ల ఆదాయం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కుజుడు సంచారం కారణంగా జీవితంలో ఆనందం పెరగడమే కాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.


సింహ రాశి:
కుజుడి సంసారం కారణంగా సింహ రాశి వారికి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు సంచారం కారణంగా లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం గడుపుతున్న వారు ఈ క్రమంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook