Budh Gochar in Kumbh Rashi 2024:  సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. అందుకే ఇతడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధ గ్రహం గమనంలో మార్పు ప్రజలందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రేపు అంటే ఫిబ్రవరి 20న బుధుడు మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభరాశిలో బుధ గ్రహం సంచారం వల్ల ఐదు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి
బుధ గ్రహ సంచారం వల్ల తులారాశి వారి తెలివితేటలు పెరుగుతాయి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు ఈ సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
మకరరాశి
ఈ సమయంలో మకర రాశి వారు తమ మాటలతో ఎవరినీ నొప్పించకండి. బుధుడి రాశి మార్పు వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ఆగిపోయిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు. జాబ్ మారడానికి ఇదే మంచి సమయం. 
మేష రాశి
బుధ గ్రహం రాశి మార్పు మేషరాశి వారికి చాలా డబ్బును ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు లోన్ దొరుకుతుంది. మీరు దారిద్ర్యం నుండి బయటపడతారు. వ్యాపారస్తులు లాభపడతారు. ఉద్యోగం సాధించాలనే మీ కల ఫలిస్తుంది. 


Also Read: Astrology: 12 యేళ్ల తర్వాత రవి, గురు గ్రహాల అపూర్వ కలయిక.. ఈ మూడు రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..


మిథున రాశి
మెర్క్యూరీ రాశి మార్పు మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు లక్ కలిసి వస్తుంది. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలంగా వాయిదా పడిన పనులన్నీ ఇప్పుడు వెనువెంటనే పూర్తవుతాయి. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. 
కన్య
బుధుడు కుంభరాశి ప్రవేశం కన్యారాశి వారు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఉండే వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Shani Budh Yuti 2024: మరో 24 గంటల్లో లక్షాధికారులు కాబోతున్న రాశులు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook