Shukra Gochar 2024: రాశిని మార్చనున్న శుక్రుడు.. ఈ 3 రాశులవారు కోటీశ్వరులవ్వడం ఖాయం..
Shukra Gochar 2024: అష్టగ్రహాల్లో ఒకటైన శుక్రుడు ప్రస్తుతం శనిదేవుడి రాశి అయిన మకరరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెలలో కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. దీంతో కొందరి అదృష్టం మారనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit in March 2024: సూర్యుడి నుంచి దూరంలో రెండో గ్రహం శుక్రుడు. ఇది చాలా ప్రకాశవంతమైన గ్రహం. పురాణాల ప్రకారం, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు పేరు మీద ఈ గ్రహనికి పేరు పెట్టారు. శుక్ర గ్రహం కదలిక ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్న శుక్రుడు.. వచ్చే నెల 07న కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడిని సంపద మరియు ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. మార్చి నెలలో శుక్ర సంచారం మూడు రాశులవారు లాభపడనున్నారు.
కుంభ రాశి
ఇదే రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చేద్దామన్నా లైఫ్ పార్టనర్ నుంచి మీకు సపోర్టు ఉంటుంది. మీకు త్వరలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
వృషభం
శుక్రుడు కుంభరాశి ప్రవేశం వృషభరాశి వారికి అదిరిపోయే బెనిఫిట్స్ ఇవ్వబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జాబ్ వస్తుంది. వ్యాపారులు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీడియా, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉండబోతుంది.
తులారాశి
శుక్రుని గమనంలో మార్పు వల్ల తులరాశి వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పైగా ఈరాశికి అధిపతి కూడా శుక్రుడు. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు.
Also Read: Astrology: త్వరలో బృహస్పతి, శుక్రుల అద్బుత కలయిక.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..
Also Read: Shani Budh Yuti 2024: మరో 24 గంటల్లో లక్షాధికారులు కాబోతున్న రాశులు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook