Trigraha yogam 2023: మూడు గ్రహాల కలయికతో ఆ 3 రాశులకు అక్టోబర్ 15 నుంచి మహర్దశే
Trigraha yogam 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల యోగానికి కూడా మహత్యముంటుంది. అలాంటిదే త్రి గ్రహ యోగం. అసలీ త్రిగ్రహ యోగం అంటే ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.
Trigraha yogam 2023: హిందూమతంలో జ్యోతిష్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాల గోచారంతో పాటు గ్రహాల కలయిక కారణంగా గ్రహాల యోగం ఏర్పడుతుంటుంది. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా అక్టోబర్ నెలలో ఏర్పడనున్న త్రిగ్రహ యోగం అంటే మూడు గ్రహాల యోగం ఎలాంటి ప్రభావం చూపించనుందో పరిశీలిద్దాం.
అక్టోబర్ 3వ తేదీన మంగళ గ్రహం గోచారంతో తులా రాశిలో ప్రవేశించనున్నాడు. కేతు గ్రహం ఇప్పటికే ఈ రాశిలో ఉంది. ఫలితంగా మంగళ కేతు గ్రహాల అశుభ యోగం వెంటాడుతోంది. ఇక అక్టోబర్ 15వ తేదీన చంద్రుడి గోచారంతో తులా రాశిలో ప్రవేశించనున్నాడు. మరోవైపు ధన సంపదలు, అన్ని రకాల సుఖాలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహానికి చెందిన తులా రాశిలో ప్రవేశించి త్రిగ్రహ యోగం ఏర్పరుస్తుంది. ఫలితంగా మూడు రాశులవారికి ఊహించని విధంగా డబ్బు వచ్చి పడనుంది. అదృష్టం తోడుగా ఉండటంతో అన్ని పనులు సకాలంలో జరిగిపోతాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. అక్టోబర్ 17న చంద్రుడి గోచారం కాగానే త్రి గ్రహయోగం తొలగిపోతుంది.
కన్యా రాశి జాతకులపై త్రిగ్రహ యోగం విశేషమైన ప్రభావం చూపించనుంది. ఈ రాశివారికి ఆర్ధికంగా లబ్ది చేకూర్చేందుకు కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ చేస్తారు. ఆర్ధికంగా లాభాలు ఆర్జిస్తారు. పడిన కష్టానికి ఫలితం ఉంటుంది. అభివృద్ధి కచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి జాతకులకు త్రిగ్రహ యోగం ఊహించని లాభాల్ని అందించనుంది. షేర్ మార్కెట్ సంబంధిత వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి. అంటే చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశముంది. ఉద్యోగస్థులకు కొత్త అవకాశాలు లాభిస్తాయి. వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఫలితంగా ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు.
మిధున రాశి జాతకులకు త్రిగ్రహ యోగం అద్భుతమైన లాభాన్నిస్తుంది. డబ్బులు సంపాదించేందుకు మంచి సమయం. లేదా ఊహించని విధంగా పెద్దఎత్తున డబ్బు లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కనకవర్షం కురుస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశముంది. షేర్ మార్కెట్‌కు కూడా అనుకూలమైన సమయమిది.
Also read: Mars Transit 2023: ఈ రాశులవారికి నవంబర్ 16 వరకు అంగారక గ్రహం ఎఫక్ట్..జరగబోయేది ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook