Trigrahi Yog: శని ఇంట్లో త్రిగ్రాహి యోగం... ఈ రాశులకు ఆర్థికంగా లాభం.. ఇందులో మీరున్నారా?
Trigrahi Yog In Aquarius: పంచాంగం ప్రకారం, కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ఆర్థికంగా మేలు చేస్తుంది.
Trigrahi Yog In Kumbh 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో తమ రాశిచక్రాలను మారుస్తాయి. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరిలో సూర్యుడు మరియు బుధుడు తమ రాశులను ఛేంజ్ చేసి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మూడు రాశుల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు అపారమైన ధనాన్ని పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిథునం(Gemini)
త్రిగ్రాహి యోగం ఏర్పడటం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదో స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. పని నిమిత్తం మీరు బయటకు వెళ్లాల్సి రావచ్చు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మేషం (Aries)
త్రిగ్రాహి యోగం ఏర్పడటంతో మేష రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఈసమయం అద్బుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
కన్య రాశి(Virgo)
కన్యారాశి వారికి త్రిగ్రాహి యోగం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఆరవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో మీరు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. మీరు ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Also Read: Grah Gochar 2023: ఫిబ్రవరిలో 3 గ్రహాల రాశి మార్పు.. ఈ 5 రాశులకు భారీగా డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook