Tirumala Srivari Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులు సంతోషించే వార్త ఇది. నవంబర్ నెల శ్రీవారి సేవల కోటాను రేపు ఆగస్టు 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. వివిధ రకాల సేవల టికెట్లు కూడా రేపే విడుదల కానున్నాయి. https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల భక్తులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.  రేపు ఆగస్టు 27వ తేదీ ఉదయం 11 గంటలకు https://ttdevasthanams.ap.gov.in ఆన్‌లైన్ విధానం ద్వారా శ్రీవారి సేవ నవంబర్ నెల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటా టికెట్లు, 12 గంటలకు శ్రీవారి నవనీత సేవ టికెట్లు, 1 గంటకు శ్రీవారి పరకామణి సేవ టికెట్లు విడివిడిగా విడుదల కానున్నాయి. తిరుమల భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటీడీ విజ్ఞప్తి చేస్తోంది.  శ్రీవారి సేవకులకు టీటీడీ ఉచిత దర్శనం, వసతి కల్పించనుంది. రేపు ఒక్కరోజే ఈ అవకాశం కలగనుంది. 


శ్రీవారి సేవ టికెట్లను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే బుక్ చేసుకోవాలని, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పటికే ఆగస్టు 24వ తేదీన శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లు విడుదలయ్యాయి. 


తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్ల ద్వారా నిన్న ఒక్కరోజులో 70 వేల మంది సందర్శించుకున్నారు. మరో 34 వేలమంది తలనీలాలు సమర్పించారు. స్పెషల్ సేవా దర్శనానికి సైతం 5-6 గంటల సమయం పడుతోంది. 


ఇక టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని నాలుగు మాడ వీధులు, లడ్డూ కౌంటర్లను పరిశీలించారు. అక్టోబర్ 4 నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవ జరిగే రోజు భక్తుల ఎంట్రన్, ఎగ్జిట్ మార్గాల్ని పరిశీలించారు. క్యూ లైన్లను పరిశీలించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. 


Also read: Snakes Shocking Facts: పాముల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు, నాలుకతో వాసన చూస్తాయా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook