Tuesday Remedies: పొరపాటున కూడా ఈ 5 వస్తువులను మంగళవారం కొనొద్దు.. కొంటే కష్టాలను కొని తెచుకున్నట్టే!
Tuesday Remedies, Do Not buy New House, Black Clothes and Glass on Tuesday. మంగళవారం కొన్ని వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కొంటే కష్టాలను కొని తెచుకున్నట్టే.
Tuesday Remedies: Do Not buy These Five Things on Tuesday even by mistake: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతిరోజు ఓ దేవుడు/దేవతకి అంకితం చేయబడింది. ఈ క్రమంలోనే మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున బజరంగబలిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా ప్రయోజనకరం. మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా భక్తుల అన్ని కోరికలు నెరవేరుతాయి. మంగళవారం కొన్ని ముఖ్యమైన నియమాలను కూడా పాటించాలి. వెంట్రుకలు, గోళ్లు కత్తిరించకూడదు. ఇది కాకుండా మంగళవారం కొన్ని వస్తువులను కూడా అస్సలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కొంటే కష్టాలను కొని తెచుకున్నట్టే. ఆ వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం.
మిఠాయిలు తినకూడదు:
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పాలు చంద్రునికి సంబంధించినవి. అంగారకుడు మరియు చంద్రుడు ఒకదానికొకటి శత్రు గ్రహాలు. అందుకే మంగళవారం పాలతో చేసిన మిఠాయిలు కొనకూడదు. అంతేకాదు పాలతో చేసిన మిఠాయిలు తినకూడదు, ఎవరికీ ఇవ్వకూడదు.
నల్లని బట్టలు ధరించకూడదు:
మంగళవారం కూడా నల్ల గుడ్డ కొనుగోలు చేయడం అశుభం. అంతేకాదు మంగళవారం నాడు నల్లని బట్టలు కూడా ధరించకూడదు. చాలా మందికి దీనిపై అవగాహన ఉండదు. మంగళవారం ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం మంచిది.
కొత్త ఇల్లు కొనకూడదు:
హనుమంతుడితో పాటు మంగళవారం మంగళ్ దేవ్‌కు అంకితం చేయబడింది. కాబట్టి మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు, కొత్త ఇల్లు కొనకూడదు. ఈ రోజున భూమి పూజ మరియు గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదు. అలా చేస్తే ఇంట్లో పెద్ద తల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
గాజులు కొనకూడదు:
మంగళవారం నాడు గాజులు కొనకూడదు. గాజుకు సంబందించిన అద్దాలు, పాత్రలు, అలంకరణ వస్తువులు కూడా కొనకూడదు. ఇది హనుమంతునికి కోపం తెప్పిస్తుంది. గాజు లేదా ప్లాస్టిక్ వస్తువులను మంగళవారం రోజున ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.
ఇనుము కొనకూడదు:
సాధారణంగా శనివారం నాడు ఇనుము కొనకూడదని అందరికీ తెలుసు. శనివారం మాదిరిగానే మంగళవారం నాడు ఇనుము కొనుగోలు చేయరాదు. ఇలా చేయడం వల్ల హనుమంతుడికి కోపం వస్తుంది. మంగళవారం ఇనుము కొనుగోలు చేయడం ద్వారా ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.