Tulsi Astro Tips: హిందువులు తులసి మెుక్కను దేవతగా పూజిస్తారు. తులసి మెుక్కలో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో తులసి మెుక్కను (Vastu Tips For Tulsi) ఉంచడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. ఉదయాన్నే తలస్నానం చేసి.. తులసి మెుక్క నీరు పోసి.. దీపం పెట్టి పూజిస్తారు. ఇది ఎండిపోకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు. తులసి మెుక్కకు సంబంధించి ఎన్నో చిట్కాలు వాస్తుశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ మెుక్కను సరైన దిశలో ఉంచితేనే శుభ ఫలితాలు లభిస్తాయి. తులసిని రోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి గుర్తించుకోండి
>> స్నానం చేయకుండా తులసి చెట్టును తాకడం పాపంగా భావిస్తారు. తులసికి స్నానం చేసిన తర్వాత మాత్రమే నీటిని పోయాలి. 
>> తులసి మెుక్కకి నీళ్ళు పోసే ముందు ఏమీ తినకూడదని గుర్తించుకోండి
>> ఆదివారం నాడు తులసికి నీరు పోయకూడదు. ఈ రోజున తులసి మెుక్క విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు. 
>> ఏకాదశి నాడు తులసి చెట్టుకి నీళ్లు పోయాలి. ఈ రోజున తులసి మాత విష్ణువు కోసం నిర్జల వ్రతాన్ని పాటించినట్లు జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 
>> సూర్యోదయ సమయంలో తులసి చెట్టుకు నీరు పోయడం శుభప్రదంగా భావిస్తారు.
ఈ దిశలో నాటండి
తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలో నాటాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తులసి మొక్కను ఈశాన్య దిశలో కూడా నాటవచ్చు. ఈ దిశలో తులసి మొక్కను ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూలత ఉంటుంది.  
నీరు పోసేటప్పుడు ఈ మంత్రం చెప్పండి
తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ ప్రత్యేక మంత్రాన్ని ఉచ్ఛరిస్తే మీ ఐశ్వర్యం 1000 రెట్లు పెరుగుతుంది. అంతే కాదు, ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అన్ని రోగాలు నుండి విముక్తి లభిస్తుంది.


మంత్రం- మహాప్రసాదం జననీ, సర్వ సౌభాగ్యవర్ధినీ
ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే. 


Also Read: Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook