హిందూమతంలో తులసి మొక్కలంటే పవిత్రమైనవి. పూజచేసేవి. తులసి మొక్క ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఒక్కమాటలో చెప్పాలంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుందంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో..ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి. శాస్త్రాల ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవీ ఆవాసముంటుందంటారు. నిర్ణీత పద్దతిలో తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణు భగవానుడి కటాక్షం లభిస్తుంది. అటు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉంటే..పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంటారు.


వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజూ తులసి మొక్కను పూజించడం వల్ల శుభం కలుగుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో తులసిమొక్క ఉపయోగాలు విపులంగా చర్చించారు. తులసి నీరు ఇందులో ఒకటి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ పద్ధతులు పాటిస్తే..ఆ వ్యక్తికి ఆర్ధికపరమైన సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి.


తులసి మొక్క నీళ్లతో కలిగే ఉపయోగాలు


ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు వేయాలి. ఇలా చేస్తే ఆ చెంబులోని నీళ్లు పవిత్రమైపోతాయి. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుంది.


వాస్తు పండితుల ప్రకారం రాత్రంతా తులసి ఆకుల్ని నీళ్లలో నానబెట్టాలి. ఆ తరువాత ఉదయం ఆ నీటిని మొత్తం ఇళ్లంతా పిచికారీ చేయాలి. ఇంట్లోని ప్రతిమూలల్లో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది.


విష్ణు భగవానుడికి కూడా తులసి అంటే ఇష్టం. శ్రీ కృష్ణుడు విష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే ఈ నెలలో శ్రీ కృష్ణుడిని తులసి నీళ్లతో స్నానం చేయించడం వల్ల కృష్ణుడి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఒక రాగిచెంబులో నీళ్లు తీసుకుని తులసి ఆకులు అందులో వేయాలి. ఆ నీళ్లతో గోపాలుడికి స్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల బాల గోపాలుడు త్వరగా ప్రసన్నుడౌతాడు.


వ్యాపారంలో అభివృద్ధికై తులసి నీరు చాలా ఉపయోగకరం. దీనికోసం తులసి ఆకుల్ల నీరు పోసి..2-3 రోజులు అలానే వదిలేయాలి. ఆ తరువాత ఈ నీళ్లను తలపైనుంచి పోసుకోవాలి. దాంతోపాటు ఫ్యాక్టరీ, దుకాణం, ఆఫీసు, కార్యాలయాల్లో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ దూరమౌతుంది. 


ఆరోగ్యంగా ఉండేందుకు తులసి నీటిని వినియోగిస్తారు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే...ఉదయం, సాయంత్రం పూజ చేసిన తరవాత తులసి నీళ్లను స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు తులసి నీళ్లను మరగబెట్టి ఆ వ్యక్తితో తాగించాలి.


Also read: Venus Transit 2022: శుక్రుడి వృశ్చికరాశి ప్రవేశం... ఈ 3 రాశులవారికి పేదరికం నుండి విముక్తి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook