Ugadi 2023: ఉగాది పండగ రోజున ఇలా అభ్యంగన స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో కలుగుతాయో తెలుసా?
Ugadi 2023 Telugu: ఉగాది పండగ రోజున ఇలా శరీర భాగంలో నూనెను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నొప్పుల సమస్యలతో బాధపడేవారికి కూడా ఉపశమనం లభిస్తుంది.
Ugadi 2023 Telugu: భారతీయులు ఉగాది పండగను కొత్త సంవత్సరంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది పండగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ సారి మార్చి 22వ తేదిన వస్తోంది. కాబట్టి దక్షిణ, ఉత్తర భారత దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ప్రతి సంవత్సరంలో చైత్రమాసం ప్రారంభంలో ఉగాది జరుపుకుంటారు. అయితే ఈ పండగ ఉదయం నూనె స్నానాలతో మొదలై రాత్రి పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. చాలా రాష్ట్రాల్లో నూనె స్నానాలకు చాలా ప్రముఖ్యత ఉంది. ఉగాది రోజున అభ్యంజనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, దాని ప్రాముఖ్యత ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరపై ఈ చోట్ల నూనెతో మసాజ్ చేసి అభ్యంగన చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి:
నుదురు:
చాలా రాష్ట్రాల్లో ఉగాది రోజూన ఉదయం పూట అభ్యంగన స్నానానికి ముందు..చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలితో నుదుటిపై ఎడమ నుంచి కుడి వైపు నూనె అప్లై చేసి మసాజ్ చేసుకుంటారు. అంతేకాకుండా రెండు కళ్లకు నూనెతో మసాజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల విశ్రాంతి లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ముక్కు:
అంతేకాకుండా శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగమైన ముక్కు కింద కూడా చూపుడు వేలితో నూనెను అప్లై చేసి మసాజ్ చేస్తారు. అంతేకాకుండా ఆ నూనె వాసన కూడా చూస్తారు. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు గాలి తాకి శక్త వంతంగా తయారవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోటి చుట్టూ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది:
ముక్కు క్రింద నుంచి గడ్డం వరకు నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
బుగ్గలు:
రెండు చెంపలకు వృత్తాకార కదలికలో వేళ్ల సహాయంతో నూనె రాయండి. నూనెను చెంపలకు రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారి చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చెవులు:
బొటనవేళ్లతో రెండు చెవులలో నూనెను వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పై భాగంలో నూనెతో మసాజ్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా చెవి ఎవైనా సమస్యలు ఉంటే సులభంగా ఉపశమనం కలుగుతుంది.
మెడ:
మెడ వెనుక భాగంలో కూడా విశుద్ధ-చక్రం వరకు నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా ఉగాది రోజే కాకుండా ప్రతి రోజూ అప్లై చేయడం వల్ల సులభంగా నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మెడపై చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook