Ugadi Vrishchika Rasi Phalalu 2024-25: క్రోధినామ సంవత్సరం.. వృశ్చిక రాశివారికి ఇంత అదృష్టం మళ్లీరాదు..
Ugadi Vrishchika Rasi Phalalu 2024-25: వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు విశాఖ 4వ పాదము అనురాధ 1,2,3,4 పాదాలు జేష్ట 1,2,3,4 పాదాలు.వృశ్చిక రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14 రాజ్యపూజ్యం 4, అవమానం 5,ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి విద్య, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.
Ugadi Vrishchika Rasi Phalalu 2024-25: వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు విశాఖ 4వ పాదము అనురాధ 1,2,3,4 పాదాలు జేష్ట 1,2,3,4 పాదాలు.వృశ్చిక రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14 రాజ్యపూజ్యం 4, అవమానం 5,ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి విద్య, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో భాగస్వామితో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అయితే, ఈ రాశి వారు పెద్దలను ధిక్కరించి ప్రేమ వివాహం చేసుకుంటే కలిసి రాదు.
ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అయినా సరే సాంఘికంగా అద్భుతమైనటువంటి స్థితికి ఎదగగలుగుతారు. ఉద్యోగంలో కూడా మంచి మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.క్రయవిక్రయాలు బాగా లాభాలను తెచ్చి పెడతాయి. అలాగే రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి అప్పు నుంచి తొందరగా బయటపడతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పలుకుబడి వల్ల అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏవి ఉండవు. ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఎముకలకు సంబంధించిన ఆరోగ్యపరమైన వ్యవహారాలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.
ఇదీ చదవండి: తులరాశివారు ఈ ఒక్కనియమం పాటిస్తే ఈ ఏడాది నక్కతోకతొక్కినట్టే.. ఇల్లు, ఆర్థికయోగం..!
ఉద్యోగాలు చేస్తున్నవారికి అధికారుల సహాయ సహకారాల వల్ల ప్రమోషన్ వస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ ఒక్కొక్కసారి ఆలస్యమైనా కూడా వారు కోరుకున్న చోటికి వెళ్తారు. వ్యాపారస్తులకు ఎక్కువగా వ్యాపారం జరిగి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ధన లాభం కలుగుతూ ఉంటుంది. క్రీడాకారులు, సినిమా రంగంలో ఉన్న నటీనటులకు గాయనీ గాయకులకు వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ బహుమతులు కూడా లభించే సూచనలు ఉన్నాయి.
ఇదీ చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది.. ?
క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలివితేటలతో వాక్చాతుర్యంతో ఆ ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమైన సరే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి స్త్రీలకు ఉద్యోగ రంగంలో కూడా ప్రమోషన్లు వచ్చే కుటుంబ జీవితం బాగుంటుంది. అవసరమైన మేరకు వృశ్చిక రాశి స్త్రీలు ఈ సంవత్సరం ప్రయాణాలు మానుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్నది. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.మే, జూన్, సెప్టెంబర్ నెలలు బాగా అనుకూలం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి