July Unlucky Zodiac Sign 2024: ప్రతి గ్రహం కాలానికి అనుగుణంగా గ్రహ సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు ఒకే నక్షత్రంలో లేదా రాశిలో కలుస్తాయి. ఇలా కలవడానికి జ్యోతిష్య శాస్త్రంలో సంయోగం అని అంటారు. గ్రహాలు సంయోగం చేసినప్పుడు మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే గ్రహాలకు పాలకుడిగా భావించే కుజుడు జులైలో వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే బృహస్పతి గ్రహం కూడా అదే రాశిలో ఉండడం వల్ల రెండు గ్రహాల సంయోగం జరిగే అవకాశాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా శుభ సూచిక లా భావించే అంగారక గ్రహం ఉగారాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశుల వారిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కుజుడు మేషరాశిలో ఉన్నాడు. జులై 12వ తేదీ వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే గతంలో నిలిచిపోయిన పనులను తొందరగా పూర్తవుతాయి. ఎప్పటినుంచో అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. కానీ ఈ రెండు గ్రహాలు జాతకంలో అశుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన సమస్యలు రావచ్చు.


ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
తులారాశి:

తులా రాశి వారికి ఈ సమయం కాస్త ఆశుభంగా ఉంటుంది. ముఖ్యంగా కష్టపడి పని చేయడం వల్ల కొన్నిసార్లు లాభాలు పొందినప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలు చవిచూసే అవకాశాలున్నాయి. దీంతోపాటు ప్రతి పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణంగా ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు ఆర్థికంగా కూడా నష్టపోతారు. ముఖ్యంగా పెద్ద పెద్ద పనులు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఓపికగా ఉండి పనులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేయడం మంచిది కాదు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. 


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుంచి కష్టకాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కూడా గొడవపడే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్థికంగా కూడా అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు అందరితో విభాగాలు పెరగడం  కారణంగా సమాజంలో మీ పేరు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. అలాగే అదనపు ఖర్చులు కూడా పెరగవచ్చు పిల్లల నుంచి కూడా కాస్త సమస్యలు ఎదురవుతాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కన్యా రాశి: 
కన్యా రాశి వారిపై కూడా ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా చెడు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. దీంతోపాటు కష్టపడితే తప్ప ఎలాంటి ఫలితాలను పొందే అవకాశాలు లేవు.. అలాగే అధికంగా ఖర్చులు పెరగడం కారణంగా ఆర్థికంగా కూడా కాస్త సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక ఖర్చులు నివారించుకోవడం చాలా మంచిది ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో జీవితంలో ఆందోళన పెరగడమే కాకుండా అప్పులు తీసుకున్న వారికి చాలా గడ్డుకాలం ఏర్పడుతుంది. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి వీరు తప్పకుండా ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మీ ఎంతో మేలు..


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి