Rahu Transit: 2023 అక్టోబరు వరకు మేషరాశిలో రాహువు... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు...
Rahu Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు యెుక్క స్థానం మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రాహువు అక్టోబర్ 2023 వరకు మేషరాశిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
Rahu Transit 2023: ఆస్ట్రాలజీలో రాహు-కేతు గ్రహాలను ఛాయా గ్రహాలు అని పిలుస్తారు. వీరి స్థానాల్లో మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. రాహువు మరియు కేతువులు ఎల్లప్పుడు తిరోగమన స్థితిలోనే కదులుతాయి. ఏడాదిన్నరకు ఒకసారి తమ రాశులను మారుస్తాయి. వచ్చే ఏడాది అక్టోబరు 30న రాహు గ్రహం తన రాశిని మార్చుకుని మీనరాశిలోకి ప్రవేశించనుంది. అక్టోబరు 2023 వరకు రాహు మేష రాశిలో (Rahu Transit 2023) ఉంటుంది. ఈ సమయం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
రాహువు సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిథునం (Gemini): మిథున రాశి వారికి రాహువు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తారు. వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదాయం పెరగడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. వ్యాపారానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మెుత్తానికి ఈ సమయం మిథునరాశివారికి సూపర్ గా ఉంటుంది.
కర్కాటకం (Cancer): ఆకస్మికంగా డబ్బు అందుతుంది. వృత్తిలో బాధ్యత పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దీంతో మీకు డబ్బుకు లోటు ఉండదు. స్నేహితులు, బంధువుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కెరీర్ లో పురోగతికి మంచి అవకాశాల ఉన్నాయి.
వృశ్చికం (Scorpio): మేషరాశిలో రాహువు తిరోగమనం వల్ల ఈ రాశివారి ఆర్థికస్థితి బలపడుతుంది. కెరీర్ లో పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది.
కుంభం (Aquarius): ఈరాశివారికి రాహువు శుభ ఫలితాలను ఇస్తాడు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. రిస్క్ తీసుకున్నా లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి సమయం. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Shani Dev: ఈ 3 రాశులు శని దేవునికి చాలా ఇష్టం.. కాబట్టి ఈ రాశువారికీ ఆ నెల దాకా ధన ప్రవాహమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి