Shani Vakri 2022:  ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. ఎందుకంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలాలు ఇస్తాడు కాబట్టి. నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని ఒకటి. శనిదేవుడు తన రాశిని మార్చడానికి సుమారు ఏడాదిన్నర పడుతుంది. శని స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి.  ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో తిరోగమనంలో(Shani Planet Retrograde 2022) ఉన్నాడు. అక్టోబరు 23వరుకు అదే స్థితిలో ఉంటాడు. మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో సంచారంలోకి వస్తాడు. అయితే మకరరాశిలో శని తిరోగమనం పలు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): శని సంచారం ఈ రాశివారికి చాలా మేలు చేస్తుంది. అక్టోబరు 23 వరుకు ఈ రాశులవారు వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏదైనా ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ముఖ్యంగా ఇనుము, చమురు మరియు ఫెర్రస్ వస్తువుల వ్యాపారం చేసే వారికి చాలా లాభాలు ఉంటాయి.


ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి శని వక్రత చాలా లాభాలను తెస్తుంది. వీరు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ పొందుతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు విపరీతంగా లాభాలు సాధిస్తారు. 


మీనం (Pisces): తిరోగమన శని మీనరాశికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తద్వారా వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు హైక్ లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు మెండుగా ఉంటాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు పెద్ద డీల్ ఫైనల్  కావచ్చు. పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలను గడిస్తారు. 


Also Read; మీనరాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook