Shukra Vakri 2023: వ్యతిరేక దిశలో నడవనున్న శుక్రుడు.. వీరు ధనవంతులవ్వడం పక్కా..
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 23న కర్కాటక రాశిలో తిరోగమనం చేయనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Vakri Shukra 2023 in Kark: ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ నెల 23న శుక్రుడు తిరోగమనం చేయనున్నాడు. లవ్, అందం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు రివర్స్ కదలిక మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శుక్రుడి తిరోగమనం వల్ల మూడు రాశులవారు లాభాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
శుక్రుడి తిరోగమనం ఈ రాశులకు వరం
వృషభం: శుక్రుని తిరోగమనం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది.
కర్కాటకం: కర్కాటక రాశిలో మాత్రమే శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు. శుక్రుని తిరోగమనం కర్కాటక రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీ లైఫ్ బాగుంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు వేసిన ఫ్లాన్స్ అన్నీ ఫలిస్తాయి.
మకరం: శుక్రుని తిరోగమనం మకర రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో మీ స్థానం బలపడుతుంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు పురోభివృద్ధి సాధిస్తారు. విదేశాలతో అనుబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Shani Margi 2023: త్వరలో సరైన మార్గంలోకి శని... ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి